Kurti | సంప్రదాయానికి దూరం కాకుండానే.. స్టైలిష్‌గా కనిపించాలనికోరుకునేవారి కోసం డిజైనర్లు చాలా కసరత్తే చేస్తున్నారు. సాధారణ దుస్తులకే ఫ్యాషన్ జోడించిన రకరకాల డిజైన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. రెగ్యులర్ కుర్తీలకు సైడ్ కట్ ఇచ్చి ట్రెండీలుక్ జతచేసిన తాజా కలెక్షన్ మీకోసం..
హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్‌పై చిన్నచిన్న బ్లాక్ కలర్ బుటీస్ ప్రింట్ చేసి ఈ కుర్తీని డిజైన్ చేశారు. యోక్ పార్ట్ సెపరేట్‌గా ఇచ్చి, సింపుల్‌గా బోట్ నెక్‌తో సరిపెట్టారు. బాటమ్ పార్ట్‌కి ప్రిల్స్ జతచేసి, కాంట్రాస్ట్‌గా చుడీ హ్యాండ్స్ ఇచ్చారు. ప్రిల్స్ మధ్యలో డీప్‌గా సైడ్ కట్ ఇవ్వడంతో ట్రెండీ లుక్ వచ్చింది. బ్లాక్ కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇచ్చారు. యాంకిల్ లెన్త్ మరింత ట్రెండీగా ఉంది.
గోధుమరంగు సిల్క్ ఫ్యాబ్రిక్‌పై బ్లాక్ కలర్ వర్లి ప్రింట్ జోడించిన కుర్తీ ఇది. ఒకే ఫ్యాబ్రిక్‌తో టాప్ అండ్ బాటమ్ డిజైన్ చేసి.. రెండిటినీ జతచేశారు. యోక్ పార్ట్‌లో బోట్ నెక్ ఇచ్చి సైడ్ లైన్‌తో బ్లాక్ కలర్ పొట్లి బటన్స్ పెట్టారు. స్లీవ్‌లెస్ హ్యాండ్స్‌కు నల్లరంగు ఫ్యాబ్రిక్‌తో హాఫ్ ఇంచ్ ప్లీట్స్ జతచేశారు. బాటమ్ పార్ట్‌లో ఏ లైన్ కట్‌తో ఇచ్చిన సైడ్ స్లిట్ వల్ల స్టైలిష్ లుక్ వచ్చింది. కాంట్రాస్ట్‌గా గోధుమ రంగు సిల్క్ ఫ్యాబ్రిక్‌తో స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇచ్చారు.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్,
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
సంప్రదాయానికి ఆధునికత జోడించిన ఈ కలెక్షన్స్ ఎప్పటికీ ట్రెండీనే !!”