Shivangi Bajpai | ఢిల్లీకి చెందిన డిజైనర్ శివాంగి బాజ్పాయ్ సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. తనకెంతో ఇష్టమైన వన్యమృగాలను హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు.. ఇతర ఫ్యాషన్ ఉత్పత్తులపై ముద్రిస్తున్నారు. వాటిని అలంకరణ ప్రియులూ ఇష్టంగా కొంటున్నారు.
శివాంగి కెన్యాలో పుట్టి పెరిగినా మన సంస్కృతిని మర్చిపోలేదు. కాంగ్రాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సభ్యురాలిగా వన్యప్రాణుల వేటకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. జంతు చర్మాన్ని ఫ్యాషన్ ఉత్పత్తుల కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె రూపొందించే ప్రతి వస్తువులోనూ అడవి మీద ప్రేమ, వన్యప్రాణుల పట్ల సానుభూతి కచ్చితంగా ఉండితీరుతుంది. తదుపరి ప్రాజెక్టులో భారతీయ సంప్రదాయ కళ ‘మధుబని’ ఇతివృత్తాన్ని తీసుకున్నారు. కొత్త ఉత్పత్తులు కూడా మార్కెట్లో విరివిగా అమ్ముడవుతున్నాయి.
“బెంగాల్ టైగర్, ఖడ్గమృగాలను చూస్తేనే పారిపోతాం.. ఈ సివంగులైతే వాటికే సెక్యూరిటీ”
“CR Lejumol | 47 ఏనుగులకు ఈమె సంరక్షకురాలు.. ఎలా సాధ్యమైందంటే..”