Neeta Patel | ఈమె గుజరాత్‌లోని 300 గ్రామాల దాహం తీర్చింది
Neeta Patel | గుజరాత్‌లోని కొండ ప్రాంతాలైన నర్మద, డాంగ్, భరూచ్ జిల్లాల్లో నీటి కష్టాలు చాలా ఎక్కువ. ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీటి కోసమూ కటకటే. ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాములు ఉన్నా రకరకాల కారణాలతో అవి శిథిలమయ్యాయి. దీంతో రైతులు ఒక్క పంటకే పరిమితమయ్యారు. ఈ కష్టాలను చూసి తనవంతుగా మహిళల్ని చైతన్యవంతుల్ని చేశారు రూరల్ స్టడీస్‌లో పట్టా పొందిన నీతా పటేల్.
గ్రామ పంచాయతీల్లో నీటి కమిటీలను ఏర్పాటుచేశారు. అందులో చుట్టుపక్కల పల్లెల్లోని 2,900 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వివిధ ఎన్జీవోల సాయంతో వీళ్లంతా కలిసి అక్కడి నదుల మీద చెక్‌డ్యాములు నిర్మించుకున్నారు. పాడైన వాటిని బాగుచేసుకున్నారు. చేతి పంపులూ బావుల అనుసంధానం, పూడికతీత, నీటి కుంటల ఏర్పాటు తదితర పనులు చేశారు. రోజూ స్కూటర్ మీద ఎనభై తొంభై కిలోమీటర్లు ప్రయాణించి ఆదివాసీ గ్రామాల పరిస్థితులు తెలుసుకుంటారు నీతా. అలా వెళ్లినప్పుడు ఎత్తయిన ప్రాంతాల నుంచి నీరు వడివడిగా కిందికి దూకడం చూసి.. నీటిని పట్టి ఉంచేలా చుట్టూ చెట్లను పెంచితే బాగుంటుందని భావించారు. దీనికోసం కాల్వల చుట్టుపక్కల ఉన్న సుమారు 700 ఎకరాల్లో గ్రామస్తులు అటవీ శాఖ సాయంతో 90 వేల మొక్కలు నాటారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు జలాశయాలు కళకళలాడుతున్నాయి. భూగర్భ మట్టమూ పెరిగింది. సౌర విద్యుత్తుతో నడిచే నీటి పంపుల ద్వారా దాదాపు రెండున్నర వేల ఎకరాల భూమి సాగవుతున్నది. తద్వారా 300 పల్లెల్లోని దాదాపు 30వేల మంది నీటి కష్టాల నుంచి బయటపడ్డారు. ఈ కృషికి గాను, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి పట్ల అవగాహన కల్పిస్తున్న 41 మంది మహిళల్లో ఒకరిగా నీతా పటేల్‌నూ గుర్తించింది ఐక్యరాజ్య సమితి.
Read More :
“నాన్న ఆశయం కోసం తన కలను, గమ్యాన్నే పక్కనబెట్టింది !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Gujarat
- inspiration
- water
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

