కనుమరుగవుతున్న ఖానా వస్త్రాన్ని కాపాడుతున్న 79 ఏండ్ల వృద్ధురాలు.. ఏం చేస్తుందామె
Khana Fabric | ఉత్తర కర్ణాటకలోని గుళేద్గుడ్డ ఖానా ఫ్యాబ్రిక్.. బ్లౌజ్ క్లాత్‌కు పెట్టింది పేరు. ఇప్పుడా సంప్రదాయ వస్త్రం ఆన్లైన్ వేదికగా మళ్లీ ప్రాణం పోసుకుంది. అందుకు కారణం 79 ఏండ్ల ఆదప్ప చినప్ప అలోర్లి ( Adappa Chinappa Alorli ). పదమూడేండ్ల వయసు నుంచి దోబీ మగ్గంపై ఖానా వస్త్రాన్ని నేస్తున్నారామె. అయితే, వెరైటీ ఫ్యాబ్రిక్స్ ధాటికి ఖానా వస్త్రం కనుమరుగయ్యే పరిస్థితులు తయారయ్యాయి. ఖానా ఖజానాను ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్, ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా ఎంచుకున్నారు అలోర్లి. ఖానా వస్త్రానికి కొత్త హంగులు అద్దుతున్నారు. దీనికోసం కర్ణాటక హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి టెక్స్‌టైల్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రమేశ్ అయోడి సహకారం తీసుకుంటున్నారు.

బాగల్కోట్ జిల్లా ఖానా బ్లౌజ్ ఫ్యాబ్రిక్, ఇల్కల్ చీరలకు నిలయంగా చెబుతుంటారు. నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు ఖానాలోనే వెఫ్ట్ కాటన్, వార్ప్ కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్‌ను రూపొందిస్తున్నారు. వాటిపై ప్రకృతి చిత్రాలు, పురాణగాథలు అచ్చువేస్తున్నారు. అలోర్లి ఇచ్చిన స్ఫూర్తితో స్థానిక చేనేత కళాకారులు ఓ సమూహంగా ఏర్పడి ఖానా ఫ్యాబ్రిక్‌ను నేస్తున్నారు. దానిని www.khanaweaves.in వెబ్సైట్లో, @khana_weaves పేరుతో ఇన్‌స్టాలో నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. తయారైన ఫ్యాబ్రిక్‌ను వెంటనే విక్రయించేలా వినియోగదారులతో వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేశారు. ఇలా కేవలం రెండు నెలల్లోనే ‘ఖానా వీవ్స్’ రూ.10 లక్షలు ఆర్జించడం విశేషం.
Read More :
“అమ్మ కోసమే ఐఏఎస్.. ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ”
నాగాలాండ్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది ఈమెనే”
“R Meera | ఆ తెగ నుంచి నేవీ ఆఫీసర్ అయిన తొలి మహిళ ఈమెనే !!”
Myles Car | కార్లను అద్దెకిచ్చే వ్యాపారంలో దూసుకెళ్తున్న సాక్షి విజ్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

