Myles Car | దేశంలోనే తొలిసారిగా సెల్ఫ్ డ్రైవ్ కార్ల సేవలు ప్రవేశపెట్టిన సంస్థ.. మైల్స్. ప్రధాన నగరాల్లో కార్లను అద్దెకిస్తూ.. తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నది ఆ సంస్థ సీయీవో సాక్షి విజ్. దాదాపు 21 నగరాల్లో నలభై మోడళ్ల కార్లను అందిస్తూ ఆటోమొబైల్ రంగంలో సంచలనంగా మారింది మైల్స్. ఈ కంపెనీకి ప్రధాన నగరాల్లో 250కి పైగా పికప్ లొకేషన్లు ఉన్నాయి. బుక్‌చేసిన కొద్ది నిమిషాల్లోనే కారు కళ్లముందు ప్రత్యక్షం అవుతుంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ‘మైల్స్’ను నూతన ఆవిష్కరణల దిశగా తీసుకెళ్తున్నది సాక్షి విజ్ ( Sakshi Vij ). తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నది.
mylescars.com ద్వారా ప్రముఖ నగరాల్లో గంటల నుంచి నెల రోజుల పాటు కార్లను అద్దెకు తీసుకోవచ్చు. ప్రతి నగరంలో సగటున 400 మీటర్లకు ఒక మైల్స్ కారును అందుబాటులో ఉంచాలన్నది సాక్షి లక్ష్యం. ఈ వ్యాపారానికి కొనసాగింపుగా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్పైనా దృష్టిసారించింది సాక్షి. కార్ల కొనుగోలు, బ్యాంకు రుణాలు, డౌన్ పేమెంట్లు, లైసెన్సులు, బీమా, నిర్వహణ, మరమ్మతులు, పాత కార్ల అమ్మకాలు .. ఇలా అన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చేలా ప్రణాళికలు రూపొందించిందామె.
ప్రకృతి వైద్యానికి సంబంధించి ఈ లైబ్రరీలో దొరకని బుక్ ఉండదు!!”
Animall | పశువుల కోసం మాల్ స్టార్ట్ చేసిన ఇద్దరమ్మాయిలు”
కిక్ కోసం ఐఏఎస్ వదిలి.. అడవుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు”
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!”