R Meera | ఆ తెగ నుంచి నేవీ ఆఫీసర్ అయిన తొలి మహిళ ఈమెనే !!
R Meera | రంగం ఏదైనా, చేసే పని ఏదైనా, లక్ష్యంపై గురిపెట్టి అస్త్రాన్ని సంధించినవారే ఘన విజయం సాధిస్తారు. గెలుపు తాలూకు ఆనందాన్ని ఆస్వాదించేటప్పుడు.. ఆ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు గొప్పగా అనిపిస్తాయి. సరిగ్గా అలాంటి ఆనందాన్నే పొందుతున్నది తమిళనాడులోని నీలగిరికి చెందిన ఆర్.మీరా.
ఊటీ సమీపంలోని అచనకల్ గ్రామానికి చెందిన ఆర్.మీరా చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నది. నీలగిరిలోని బడగా తెగ నుంచి నౌకాదళ అధికారిగా ఎంపికైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె తండ్రి రవీంద్రనాథ్ ఆర్మీ దవాఖానలో టెక్నికల్ అసిస్టెంట్. దీంతో, నీలగిరి సమీపంలోని అరువంకాడు కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నది మీరా. ఇంజినీరింగ్ తర్వాత భారత సాయుధ దళాలే లక్ష్యంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలు రాసింది. తర్వాత స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలో విజయం సాధించి, కేరళలో 22 వారాల శిక్షణకు ఎంపికైంది. ఇటీవలే ఆమెకు సబ్-లెఫ్టినెంట్ హోదా లభించింది. అలా, నౌకాదళాధికారిగా ఎంపికైన తొలి బడగా జాతి మహిళగా గుర్తింపును పొందింది. ‘నన్ను ఆదర్శంగా తీసుకొని ఒక్క మహిళ ఉన్నత స్థానానికి ఎదిగినా నా జన్మ సార్థకమైనట్లే. సాయుధ దళాల్లో మహిళలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. దేశ సేవ చేయడానికి ఇదే సరైన సమయం. నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు సదా కృతజ్ఞతలు’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది మీరా.
Read More :
కిక్ కోసం ఐఏఎస్ వదిలి.. అడవుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు”
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!”
ఆఫ్రికాలో సెటిలై వివిధ రంగాల వారికి ఇన్స్పిరేషన్గా మారిన మన తెలంగాణ బిడ్డలు వీళ్లే”
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- meera
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

