నాన్న ఆశయం కోసం తన కలను, గమ్యాన్నే పక్కనబెట్టింది !!
Edem Chandana | అనగనగా ఒక నాన్న. ఆయన చేయితిరిగిన నేతకారుడు. రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న సృజనకారుడు. హఠాత్తుగా చనిపోయాడు. దీంతో, ఆయననే నమ్ముకున్న వందలాది చేనేత కార్మికులు వీధినపడ్డారు. సరిగ్గా ఆ సమయంలో రంగంలోకి దిగింది.. ఆ తండ్రి గారాల పట్టి. పట్టుమని పదిహేనేండ్లు కూడా లేవు అప్పటికి. అయితేనేం! తండ్రి ఆశయమే ఆలంబనగా విజయతీరాలకు పయనిస్తున్నది ఈడెం చందన.
‘బిడ్డా! ఇరవై ఏండ్ల కిందట నాన్న నేసిన పట్టుచీర ఇది. ఇప్పటికీ చెక్కు చెదరలే. మొన్న నా మనవరాలి పెండ్లికి నువ్వు నేసిన చీర కూడా అట్లే ఉంది బిడ్డా! సల్లగుండాలె’ అంటూ దీవించింది ఓ వృద్ధురాలు.
v v v
‘అమ్మా! రేపటికి పనేమైనా ఉందా?’
మొహమాటంగా అడిగాడో నేతన్న.
‘ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది బాబాయ్. మీరు మగ్గం సిద్ధం చేసుకోండి. నేను కలర్ డిజైన్ చేసి ఇచ్చేస్తా’ అంటూ కంప్యూటర్ పనిలో నిమగ్నమైంది. ఓ ఫంక్షన్లో సమంత కట్టుకున్న చీరలాంటిదే కావాలని కోరిందో ప్రవాస మహిళ. కస్టమర్ అభిరుచికి తగ్గట్టు డిజైన్‌కు మరిన్ని మెరుగులు దిద్దింది.
v v v

‘హలో! కొరియర్ సర్వీస్? హైదరాబాద్
జూబ్లీహిల్స్‌కు వెళ్లాల్సిన చీర ఇంకా చేరలేదు. ఒకసారి క్రాస్‌చెక్ చేసుకోండి’ అంటూ ఫోన్లో సున్నితంగా హెచ్చరించింది.
v v v
ఇన్ని బాధ్యతల మధ్య.. ఏమాత్రం ఖాళీ దొరికినా బీబీఏ మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం చదువుకుంటుంది ఈడెం చందన. దారం తయారీ నుంచి విదేశాల్లోని కస్టమర్లకు ఆర్డర్ అందించే వరకు.. అన్ని పనులూ చక్కబెడుతుంది తను. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఈడెం శ్రీనాథ్ ముద్దుల కూతురు.. చందన. నాలుగేండ్ల క్రితం తండ్రి క్యాన్సర్‌తో మరణించినా.. ఆయన ఆశయాలను నేటికీ బతికిస్తున్నది. కుటుంబ బాధ్యతలే కాదు, అప్పటివరకూ శ్రీనాథ్‌పై ఆధారపడిన వందమందికిపైగా చేనేతన్నల బాధ్యత కూడా తీసుకున్నది. ఆ ప్రయత్నంలో తన ‘ఫ్యాషన్ డిజైనింగ్’ కలను పక్కనపెట్టింది. రోజూ కొయ్యలగూడెం నుంచి ఎల్బీ నగర్‌కు చదువు కోసం ప్రయాణిస్తూ.. వ్యాపారం నిర్వహిస్తున్నది చందన.

కరోనా వేళ ..
కరోనా కారణంగా చేనేత రంగం తీవ్రంగా నష్టపోయింది. లాక్‌డౌన్‌తో ఎక్కడి సరుకులు అక్కడే నిలిచి పోయాయి. దీంతో చేనేతన్నల బతుకు తలకిందులైంది. కొందరు కస్టమర్లు డబ్బు వెనక్కి తీసుకున్నారు. తోటి చేనేత కార్మికుల దుర్భర పరిస్థితులను అతిదగ్గరి నుంచి చూసిన చందన.. ఆన్ లైన్లో విక్రయాలు ప్రారంభించింది. తనకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలపై పట్టు ఉండటంతో ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించింది. తనే మోడల్‌గా మారి ఫొటోలు తీసి అప్లోడ్ చేసింది. శ్రామికుల ఆకలి తీర్చింది. ప్రపంచం తలుపులు మూసుకుపోయిన సమయంలోనూ ముందుండి మగ్గాలను నడిపించింది. ఎక్కడా వృథా లేకుండా.. వేస్ట్ క్లాత్‌ను సైతం మాస్కులు, కుషన్ కవర్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్గా మార్చి గిట్టుబాటు ధరకు అమ్మింది. ఆ డబ్బును తననే నమ్ముకున్న చేనేత కుటుంబాలకు పంచింది.

విదేశాల నుంచి ఆర్డర్లు
చందన తండ్రి శ్రీనాథ్ డబుల్ ఇక్కత్ రూపకర్త. ఆ నైపుణ్యాన్ని తోటి చేనేతన్నలకు నేర్పి.. కొయ్యలగూడేన్ని సింగిల్, డబుల్ ఇక్కత్ క్లాత్‌కు చిరునామాగా మార్చాడు. ఆ సృజనాత్మక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తనవైన డిజైన్స్‌తో ప్రయోగాలు చేస్తున్నది చందన. ప్రజల అభిరుచులకు అనుగుణంగా తరచూ కొత్త డిజైన్లు తీసుకొస్తున్నది. ప్రధాన నగరాల్లోని బొటిక్‌లు, రిటైల్ షాపులు, కార్పొరేట్ కంపెనీలకు వస్ర్తాన్ని, చీరలను సరఫరా చేస్తున్నది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్ దేశాలకూ వ్యాపారాన్ని విస్తరించింది. చౌటుప్పల్, పుట్టపాక, గట్టుప్పల్, చండూరు తదితర ప్రాంతాల్లో అరవై మందికిపైగా చేనేతన్నలు ప్రాణం పోసిన వస్ర్తాలతో వివిధ రాష్ర్టాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంది చందన. ఒక్కో ప్రదర్శన కోసం మూడు నుంచి ఐదు రోజులు బయటే ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో, నాన్న తన పక్కనున్నాడనే ధైర్యమే తనను ముందుకు నడిపిస్తుంది. ఇప్పటివరకు పదిహేనుకుపైగా ఎగ్జిబిషన్లు నిర్వహించింది చందన. మొదట్లో కొందరు ‘ఈ పిల్ల ఏం చేస్తుంది?’, ‘ఈమెను నమ్మకుంటే నట్టేట మునిగినట్లే..’ అని మొహం మీదనే అనేవారు. ఆ విమర్శలను సవాలుగా తీసుకుని మార్కెట్లో నిలదొక్కుకున్నది చందన. ‘ఇప్పటికే శ్రీనాథ్ ఫ్యాబ్రిక్స్, శ్రీవేద ఫ్యాబ్హౌస్ పేరుతో 50 కుటుంబాల వరకూ ఉపాధి కల్పిస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో srinath_fabricలోనూ మా ఉత్పత్తులు లభిస్తాయి’ అంటున్నది ఈడెం చందన.
… డప్పు రవి
Read More :
అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆపదలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న తెలంగాణ బిడ్డ”
“అనుమానాలను పటాపంచలు చేసి గిరిజనులకు అండగా మారిన డాక్టర్.. ఇంతకీ ఆయన ఏం చేశాడు?”
“ఆన్లైన్లో ఆర్డరిస్తే డ్రెస్ కుట్టి ఇంటికే పంపిస్తరు.. హైదరాబాదీ మహిళ ఐడియా అదుర్స్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Handloom
- inspiration
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

