CR Lejumol | 47 ఏనుగులకు ఈమె సంరక్షకురాలు.. ఎలా సాధ్యమైందంటే..
Guruvayur Elephant camp first woman manager CR Lejumol | గురువాయూరు.. కేరళలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఆ క్షేత్రంలో వెలసిన కృష్ణస్వామి సేవలో పదుల సంఖ్యలో ఏనుగులు పాల్గొంటాయి. ఈ గజరాజులన్నిటినీ పున్నత్తూర్ గజశాలలో ఉంచుతారు ఆలయ అధికారులు. ఇప్పుడీ క్యాంప్ నిర్వాహకురాలిగా సీఆర్ లేజుమోల్ అనే మహిళ ఎంపికయ్యారు. మొత్తం 44 ఏనుగుల సంరక్షణ బాధ్యత పూర్తిగా తనదే. క్యాంప్ మేనేజర్‌గా 44 ఏనుగులతోపాటు మావటీలు సహా 150 మంది సేవకులనూ ఆమె పర్యవేక్షిస్తారు.
లేజుమోల్కు అక్కడి ఏనుగులన్నీ పరిచయమే. ఆమె తండ్రి మావటి. ఆమె భర్త, మామ కూడా మావటివాళ్లే. కుటుంబ నేపథ్యం ఉండటంతో, ఏనుగుల మనోభావాలు తనకు ఇట్టే అర్థమవుతాయని చెబుతున్నది లేజుమోల్. 1996లో గురువాయూర్ దేవస్థానంలో క్లర్క్‌గా ఆమె ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగి సేవల విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి చేరుకుంది. తాజాగా, ఏనుగుల క్యాంప్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ‘దైవకార్యంలో పాల్గొనే ఏనుగులకు ఎంత చేసినా తక్కువే’ అంటున్నది లేజుమోల్. రోజూ వాటికి ఆహారం అందించడంలో లోటుపాట్లు లేకుండా చూసుకుంటానని చెబుతున్నది ఆ గజదళ నాయకురాలు. తరచూ ఏనుగులకు వైద్యపరీక్షలు నిర్వహించడం, అవసరమైన చికిత్సలు అందించడం తన తక్షణ బాధ్యతలని వెల్లడించింది. ఏనుగులకు ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని ప్రకటించింది లేజుమోల్.
Read More :
“అమ్మ కోసమే ఐఏఎస్.. ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ”
“Neeta Patel | ఈమె గుజరాత్‌లోని 300 గ్రామాల దాహం తీర్చింది”
“నాన్న ఆశయం కోసం తన కలను, గమ్యాన్నే పక్కనబెట్టింది !!”
“పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మహిళలకు ఇన్స్పిరేషన్ ఈమె..
“అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆపదలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న తెలంగాణ బిడ్డ”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- elephant
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

