Crop Top | క్యాజువల్స్ అంటే.. ఇప్పుడు జీన్సూ టీషర్టే. ఆఫీసుకైనా, అవుటింగ్కు అయినా అమ్మాయిల ఓటు టీషర్ట్కే. ఆడపిల్లలు అమితంగా ఇష్టపడే ‘టీ’లు ఇప్పుడు మరింత ముద్దుగా తయారయ్యాయి. పెద్దపాపకు చిన్నగౌనులా.. పొడవు తగ్గించుకుని పొట్టిగా మారిపోయాయి. ఇవి జీన్స్ మీదికి, ట్రాక్ప్యాంట్ల మీదికి, బాక్సర్ల మీదికి నప్పుతాయి.
పొట్టి స్కర్ట్‌లతో పాటు లాంగ్ స్కర్ట్లపైకి కూడా ఫ్యాషనబుల్ మ్యాచింగ్‌గా మారిపోతున్నాయి. మామూలు టీషర్ట్స్లోని డిజైన్లన్నీ.. ఇందులోనూ ఉన్నాయి. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ నడుస్తున్నది. మామూలు టీ షర్టుల్లాకనిపిస్తున్నా పొడవు తక్కువగా ఉండటంతో వీటిని బేబీ టీలుగా పిలుస్తున్నారు.
“శ్రావణ మాసంలో సంప్రదాయంగా కనిపించాలంటే లంగావోణీ వేయాల్సిందే”