Anarkali Fashion | అక్బర్ సలీం కాలంనుంచి తిరుగులేని స్టయిల్.. అనార్కలీ. సందర్భం ఏదైనా తారలా మెరిసిపోవచ్చు. అనార్కలీకి మార్పులు చేర్పులు చేసి ఆధునికతను జోడిస్తున్నారు ఫ్యాషన్ పండితులు. ఈతరానికి కూడా నప్పేలా డిజైన్ చేసిన సరికొత్త కలెక్షన్ మీకోసం..
రా సిల్క్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్‌తో ప్రాణంపోసిన డ్రెస్ ఇది. బాటమ్ మొత్తం పూలు పరుచుకున్న ఫ్యాబ్రిక్‌తో సర్క్యులర్ ఇచ్చి వేవ్లుక్ కోసం బార్డర్లో పీకో చేశారు. టాప్పార్ట్లో ఆనంద బ్లూ చికంకారీ ఫ్యాబ్రిక్‌తో ఫుల్ హ్యాండ్స్ డిజైన్ చేసి, బోట్ నెక్ ఇచ్చారు. దీనిపై యాంటిక్ సీక్వెన్స్ ఉన్న మెటీరియల్ పెయింట్ ైస్టెలిష్ లుక్‌ను జోడించింది. ట్రెండీగా కనిపించాలనుకునే వారికి చక్కని ఎంపిక.
ప్లెయిన్ వైట్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. టాప్ అండ్ బాటమ్ ఒకే వస్త్రంతో రూపొందించారు. బాటమ్ పార్ట్‌లో నాలుగు లేయర్లలో చిన్నచిన్న ప్రిల్స్ ఇవ్వడంతో వేవ్లుక్ తోడైంది. టాప్ పార్ట్ విషయానికి వచ్చేసరికి.. బోట్ నెక్‌తో ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. ప్యూర్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌పై బ్లూ కలర్ బాందినీ జాకెట్ ఇచ్చి.. నాట్స్ జతచేశారు. సింపుల్ అండ్ ట్రెండీ లుక్ కోరుకునేవారికి సరైన ఎంపిక.
“కాఫీ తోటలు, గ్రామీణ శైలి స్ఫూర్తితో రూపొందిన ఈ నగల గురించి తెలుసా”
“Fashion Sarees | మగువల మనసు దోచేస్తున్న ట్రెండీ కలెక్షన్స్”
“Indo western Long Frocks | పార్టీల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు ఇవీ..”