Indo western Long Frocks | ఎన్నిరకాల పాశ్చాత్య దుస్తులున్నా.. పార్టీ అనగానే ట్రెండీవేర్ ఉండాల్సిందే. పార్టీలు, అవుట్డోర్ మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినవే.. ఇండోవెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్స్. అందరి దృష్టినీ ఆకర్షించే వెస్ట్రన్ టచ్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ ఇది..
ఆల్ఓవర్ సిల్వర్ గ్లిట్టర్ ఫాలింగ్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. టాప్, బాటమ్లను అదే ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. ట్రెండీ లుక్ కోసం వన్ ఇంచ్ షోల్డర్ పట్టీలను జతచేశారు. స్లీవ్‌లెస్ హ్యాండ్స్, యూ షేప్ నెక్‌తో చాలా సింపుల్‌గా, మహా ట్రెండీగా ఉందీ డ్రెస్. బయాస్ కటింగ్‌లో మామూలుకంటే కాస్త పొడవుగా ఇవ్వడంతో స్పెషల్ లుక్ వచ్చింది. ఈ డిజైనర్ ఫ్రాక్ నైట్ టైమ్ పార్టీలకు పర్ఫెక్ట్ చాయిస్.
సీ గ్రీన్ హెవీ అమెరికన్ శాటిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. యోక్ పార్ట్‌కు హాఫ్ షోల్డర్ ఇచ్చి, హెవీ లుక్ కోసం హ్యాండ్స్, షోల్డర్స్‌కు గోల్డ్ కుందన్ జర్దోసి వర్క్ చేశారు. అదే పనితనంతో రూపొందించిన వెయిస్ట్ బెల్ట్.. ప్లెయిన్ బాటమ్పై హైలైట్ అయింది. బాటమ్ పార్ట్‌లో డబుల్ గేరాతో కొంచెం హై అండ్ లో ైస్టెల్లో స్పెషల్‌గా డిజైన్ చేశారు. డీప్
షోల్డర్స్‌తో ట్రెండీలుక్ వచ్చింది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
One Gram Gold Jewellery | వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చేయించుకోండి!!”
“సెలబ్రెటీల ఫ్యాషన్‌గా మొదలైన ఈ ట్రెండ్‌పై యూత్ ఎందుకంత ఆసక్తి చూపుతుంది?”
“Chiffon Fabric | సమ్మర్లో కంఫర్ట్‌గా.. ట్రెండీగా కనిపించే ఈ డిజైన్లు తెలుసా”
పోనీటెయిల్ రోజూ ఒకేలా వేసుకుని బోర్ కొడుతున్నదా? ఇలా ట్రై చేయండి”