Monsoon Season | వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి షూ వేసుకోవాలి? అనే విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి. కొందరైతే కాలంతో సంబంధం లేకుండా దుస్తులు వేసుకుంటారు. అయితే వర్షాకాలంలో దుస్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే..
– యువతులు కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడడం మంచిది. సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. స్కిన్ టైట్ లెగ్గిన్స్ కూడా బాగుంటాయి. చీరలు, చుడీదార్లు వేసుకునే వారు శాండిల్స్, షూస్ వంటివి వేసుకుంటే మంచిది.
– హ్యాండ్ బ్యాగులు చిన్నవిగా కాకుండా కాస్త పెద్దగా ఉండేవి వెంట తీసుకెళ్తే మంచిది. అవసరమైతే గొడుగు, రెయిన్ కోటును కూడా అదే బ్యాగులో తీసుకుని వెళ్లవచ్చు. వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది.
– ముఖ్యంగా వర్షాకాలంలో ఎప్పుడూ ట్రాన్స్పరెంట్ బట్టలను వాడకపోవడమే మంచిది. జీన్స్ విషయంలో టైట్ జీన్స్ వాడవద్దు. ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో తడిగా ఉన్న బట్టల్ని ధరించవద్దు. అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– వర్షాకాలంలో స్లిప్పర్స్ వాడటం కంటే షూ వాడడం బెటర్. షూ వాడటం ఇష్టం లేనివారు సైండిల్స్ వేసుకుంటే మంచిది. స్లిప్పర్స్ వాడటం వల్ల బట్టలపై బురద చిల్లుతుంది. అంతే కాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉన్నది.
“వర్షాకాలం వచ్చేసింది.. వ్యాధుల బారిన పడొద్దంటే ఈ టిప్స్ పాటించండి”
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి”
“Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం”