వర్షకాలం మొదలైంది. ఇలాంటి తేమ వాతావరణంలో ఇంట్లోని ఫర్నీచర్ (ముఖ్యంగా చెక్కతో చేసినవి) ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉన్నది. లేదంటే, చెమ్మగిల్లే సోఫాలు, దుర్వాసన వెదజల్లే కప్ బోర్డులు, తుప్పు పట్టే ఫర్నీచర్‌తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇంట్లో పాతతరానికి చెందిన (యాంటిక్) ఫర్నీచర్ ఉంటే, ఆ గదిలో ‘డీ హ్యూమిడిఫయర్’ను ఉంచడం బెటర్.
సోఫాలు, కుర్చీలపై ఎక్కడైనా ఫంగస్ పెరుగుతున్నట్లు గుర్తిస్తే అర లీటర్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ డెటాల్‌ను కలిపి, మెత్తటి బట్టను అందులో ముంచుతూ, ఫంగస్ పెరిగిన చోట తుడవాలి.
వరండాలో, వర్షపు జల్లులు పడే ప్రాంతాల్లో చెక్క ఫర్నీచర్ లేకుండా చూసుకోండి. ఫర్నీచర్‌ను శుభ్రం చేయడానికి పొడిబట్టలనే
ఉపయోగించండి.
చెక్క ఫర్నీచర్‌ను గోడలకు పూర్తిగా ఆనించకుండా, కనీసం ఐదు అంగుళాల దూరంలో ఉండేలా చూడండి.
చెక్క అల్మరాలు, క్యాబినెట్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా, నాప్తలిన్ గోళీలు ఉంచండి.