Health Tips for Monsoon | వర్షాకాలం ఎక్కువగా వ్యాధులు మనం తాగే నీళ్లు, తినే ఆహార పదార్థాల మూలంగా వస్తాయి. మనకు తెలిసినవైనా కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే ఈ వర్షాకాలం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
– ఈకోలీ అనే బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుంది. నీళ్లను రాగి బిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది. క్రిములతో పోరాడుతుంది. అందుకే రాగి బిందెలో నీళ్లను తాగితే మంచిది. ముఖ్యంగా వర్షాకాలం రాగి బిందెలో నీరు తాగితే మరీ మంచిది.
– శరీరంలో నిల్వ ఉన్న హానికర కొవ్వులను కరిగించడంలో ఈ లోహం బాగా పనిచేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. రాగి బిందెలో నీళ్లు బరువు తగ్గడానికి దోహదపడతాయి. రాగిలో ఉండే పలు రకాల పోషకాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి.
– వర్షాకాలం జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ కాలంలో ఫాస్ట్ ఫుడ్ అస్సలు తీసుకోకపోవడమే మంచిది. ఫాస్ట్ఫుడ్ కారణంగా జీర్ణక్రియ మీద ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా ఫాస్ట్ఫుడ్ తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువ.
– మిత ఆహారం మంచిది. వర్షాకాలంలో ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. ఎప్పుడు తిన్నా సగం కడుపు ఖాళీగానే ఉంచుకోవాలి. ముఖ్యంగా నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఒక్కసారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడవద్దు.
– వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఈ కాలంలో దొరికే పండ్లను ఎక్కువగా తినాలి. మొక్కజొన్న, జామ, అల్లనేరేడు, సపోటా వంటి పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
“Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే”
Rainbow Diet: ప్లేట్లో ఈ కలర్ పండ్లు, కూరగాయలుంటే ఆరోగ్యం మీ వెంటే!!”
Fever in Children | మందుల్లేకుండా పిల్లల్లో జ్వరం తగ్గుతుందా?”
Health tips : రోజూ ఇలా చేస్తే గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు!”