Rainbow Diet: ప్లేట్లో ఈ కలర్ పండ్లు, కూరగాయలుంటే ఆరోగ్యం మీ వెంటే!!
రోజుకు ఐదురకాల పండ్లు లేదా కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలామంది. అయితే, ఆరోగ్యకర ఆహారం అంటే ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోవడం కాదు.. వేటిని తీసుకుంటారనేది ముఖ్యమని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం రెయిన్ బో డైట్ ప్లాన్‌ను సూచిస్తున్నారు. ప్లేటులో ఇంధ్రదనుస్సు రంగుల్లా పండ్లు, కూరగాయలు ఉండాలని అంటున్నారు. అలా రంగురంగుల్లో ప్లేట్ ఉంటే ఉత్సాహంగా తినగలమని చెబుతున్నారు.
ఆకుపచ్చ, ఎరుపు, ఊదా, పసుపు, నారింజలాంటి వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ప్లేట్లో ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇందులో మన శరీరానికి కావాల్సినంత వైవిధ్యమైన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఈ రెయిన్ బో డైట్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరానికి క్యాన్సర్‌తో పోరాడే శక్తి లభిస్తుంది.
1.ఎరుపు
ఎరుపు రంగు పండ్లు, కూరగాయల్లో ఆంథోసైనిన్స్ అనే పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దానిమ్మ, ఎర్ర మిరియాలు, స్ట్రాబెర్రీలు, టొమాటోలు రోజులో కచ్చితంగా తీసుకోవాలి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి స్ట్రోక్, గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి.

2.నారింజ, పసుపు
నారింజ, పసుపు రంగు పండ్లు, కూరగాయల్లో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్, నిమ్మకాయలు, నారింజ, మామిడి, చిలగడదుంపలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్లకు ప్రయోజనకరమైనవి. చర్మానికి ఆరోగ్యకరమైనవి. కీళ్ల ఆరోగ్యానికి ఇవి సహాయపడతాయి.

3. ఆకుపచ్చ
ఆకు కూరల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. బ్రొకోలీ, బ్రస్సెల్స్‌లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కివీ పండ్లు, గ్రీన్బెల్ పెప్సర్స్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో రోజూ వీటిని చేర్చుకోవడం వల్ల శరీరం మొత్తం క్లీన్ అవుతుంది. కణజాల మరమ్మతులో ఇవి సహాయపడుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4. నీలం, ఊదా రంగు
నీలం, ఉదారంగు పండ్లు, కూరగాయల్లో ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్లాక్ బెర్రీస్, రేగు పండ్లు, బ్లూ బెర్రీస్, రెడ్ క్యాబేజీ, వంకాయలు ఆరోగ్యానికి మంచివి. మూత్రనాళం ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలో వాపులను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశాన్ని తగ్గిస్తాయి.

5. బ్రౌన్ రంగు
బ్రౌన్ రంగు పండ్లు, కూరగాయల్లో ఫైబర అధికంగా ఉంటుంది. గోధుమరంగు తాజా పండ్లు, గింజలు, తృణధాన్యాలను ప్రతిరోజూ తప్పక తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. పేగు కదలికలను నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. జీర్ణక్రియ సాఫీగా ఉండేలా చూస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడతాయి.

Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

