Health Tips | పెళ్లి తర్వాత భార్యాభర్తల కలయిక గొప్ప మధురానుభూతిని కలిగిస్తుంది. ఒకరినొకరిని దగ్గర చేస్తుంది. అందుకే వైవాహిక జీవితంలో శృంగారం కూడా ముఖ్య భాగమైపోతుంది. అయితే ఎంతటి అన్యోన్యమైన జీవితంలోనూ ఒక్కోసారి ఎడబాటు తప్పదు. వైవాహిక జీవితంలో మనస్పర్థల కారణంగా లేదా పని ఒత్తిడి వల్లనో ఇతరత్రా ఏదైనా కారణాలతో దంపతులు అప్పుడప్పుడు శృంగారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంపత్య జీవితంలో ఈ విరామం తాత్కాలికమైతే ఫర్వాలేదు కానీ.. దీర్ఘకాలమైతే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సడెన్‌గా శృంగారం ఆపేస్తే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఆందోళనను తగ్గించడంలో శృంగారం సహాయపడుతుంది. శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లను ఇది నియంత్రిస్తుంది. కాబట్టి శృంగారంలో పాల్గొనేవారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అయితే శృంగారానికి దూరమైనప్పుడు ఒత్తిడిని కలిగించే హార్మోన్ల స్థాయి అదుపు తప్పుతుంది. తద్వారా ఆందోళన పెరుగుతుంది.
పరిశోధనల ప్రకారం.. వారంలో రెండు లేదా మూడు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో కన్నా.. నెలలో ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయట. ఇందుకు కారణం లేకపోలేదు.. సెక్స్ అనేది శరీరానికి వ్యాయామంలా పనిచేసి ఆందోళన, ఒత్తిడిలను తగ్గిస్తాయి. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.. గుండె బాగా పనిచేస్తుంది. జ్ణాపకశక్తి కూడా పెరుగుతుందట.
శృంగారం అనేది నిమిషానికి 5 కేలరీలను కరిగిస్తుంది. ఇది దాదాపు రోజూ వాకింగ్ చేసిన దాంతో సమానం. దీంతోపాటు శృంగారంలో పాల్గొనడం అనేది మెట్లు దిగడం, తోటలో పనిచేయడంతో సమానమైన వ్యాయామాలుగా సాయపడుతుంది. అందుకే శృంగారం అనేది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిచడంతో పాటు వ్యాయామంలా పనిచేస్తుందటారు. కామక్రీడలు ఆపేస్తే వ్యాయామం తగ్గినట్టే కదా మరి.
తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల క్రిములతో పోరాడో ఇమ్యునోగ్లోబిన్ ఏ పెరుగుతుంది. అంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారి కంటే నెలలో ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందట.
సెక్స్ అనేది మీ బ్రెయిన్ వాష్ చేసి.. మీ భాగస్వామితో మీరు ఎక్కువ కాలం కలిసి మెలిసి ఉండేలా చేస్తుంది. శృంగారం లేకుండా మీ వైవాహిక జీవితంలో సంతృప్తి కరువై.. బంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. వారంలో కనీసం ఒకసారైనా శృంగారంలో పాల్గొనే జంటలు సుఖంగా.. సంతోషంగా జీవిస్తున్నారు.
నెలకు దాదాపు 20 రోజుల పాటు స్కలనం చేసే వారితో పోలిస్తే.. నెలకు ఏడు సార్లు కన్నా తక్కువ స్కలనం చేసిన పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్(వీర్య గ్రంథి క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అలాగని అసురక్షిత, అనామక శృంగారం, బహుళ భాగస్వాములకు మొగ్గు చూపకండి. ఇది వీర్యగ్రంథి క్యాన్సర్‌ను మరింత పెంచుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సెక్స్ చేయకపోతే ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహకరించే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదల కావు. మహిళల్లో నిద్రకు సహాయపడే ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే మీరు చాలా రోజుల తర్వాత మళ్లీ సెక్స్ చేయాలనుకుంటే.. ముందు రోజు రాత్రి మంచి నిద్ర అవసరం లేదంటే నీరసంగా ఉంటారు.
శృంగారం అనేది మీ మనసును రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉద్వేగం మీ శరీరం తల, వెన్నుముక, కాళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ నొప్పి, నెలసరి సమయాల్లో వచ్చే తిమ్మిర్లు తగ్గించడానికి కూడా సహాయపడవచ్చు.
శృంగారం చేయడం ఆపేస్తే స్త్రీలలో రుతుక్రమం ఆగి, యోని కణజాలం సన్నగా మారుతుంది. అంతేకాకుండా పొడిబారిపోతుంది. అది శృంగారం చేసే సమయంలో బాధ కలిగిస్తుంది. కోరికల్ని కూడా బలహీనపరుస్తుంది. ఇంకొన్ని పరిశోధనల ప్రకారం.. వారానికి ఒకసారి కంటే తక్కువ లైంగిక సంబంధం కలిగి ఉండే పురుషుల్లో అంగస్థంభన తక్కువగా ఉంటుందట.
శృంగారం అనేది శరీరంలో బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. సెక్స్ అనేది వ్యాయామంలా మారి ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది. ఫలితంగా బీపీ పెరగకుండా ఉంటుంది. సెక్స్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్‌గా బీపీ పెరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Saffron | మగాళ్లు రోజూ కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది.. తెలిస్తే షాకవుతారు!
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్‌లు ఇవే..
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!