e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Health tips : రోజూ ఇలా చేస్తే గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి వ్యాధులు ద‌రిచేర‌వు!

Health tips : రోజూ ఇలా చేస్తే గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి వ్యాధులు ద‌రిచేర‌వు!

న్యూఢిల్లీ : ఎలాంటి జ‌బ్బుల బారిన‌ప‌డ‌కుండా దీర్ఘ‌కాలం సంతోషంగా జీవించాల‌ని అంద‌రూ కోరుకుంటారు. ఎలాంటి ఖ‌ర్చూ లేకుండా గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, క్యాన్స‌ర్ల బారిన‌ప‌డ‌కుండా ప‌దికాలాల పాటు హాయిగా బ‌తికేందుకు నిపుణులు సింపుల్ చిట్కాను సూచిస్తున్నారు. భార‌త ఆయుర్వేదంలో పాటించే ఆయిల్ పుల్లింగ్ ద్వారా వ్యాధుల ముప్పును త‌గ్గించ‌డంతో పాటు ఎక్కువ‌కాలం జీవించేందుకు అవ‌కాశం ఉంద‌ని లండ‌న్‌కు చెందిన నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ హెల్త్‌లో ప్ర‌చురించిన తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

ఆయిల్ పుల్లింగ్‌తో నోటి ఆరోగ్యం మెరుగ‌వ‌డ‌మే కాకుండా దాదాపు 30 వ్యాధుల‌ను అది ద‌రిచేర‌నివ్వ‌ద‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. క‌ణాల గోడ‌ల‌పై ఉండే మైక్రోఆర్గానిజ‌మ్స్‌ను చంపే యాంటీఆక్సిడెంట్స్‌ను ఆయిల్ పుల్లింగ్ వృద్ధి చేస్తుంద‌ని తెలిపింది. నోటి ప‌రిశుభ్ర‌త‌ను కాపాడటం స‌హా ఆయిల్ పుల్లింగ్‌తో శ‌రీరంలో జీవ‌క్రియ‌లు వేగ‌వంత‌మ‌వుతాయ‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

అలిసిన క‌ణాలు, అవ‌య‌వాల‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంద‌ని, మాన‌వుల్లో దీర్ఘాయువు పెంపొందిస్తుంద‌ని తెలిపారు. ఆయిల్ పుల్లింగ్‌తో నాలుగు వారాల్లోనే ప‌ళ్ల‌లో పేరుకుపోయిన పాచి, ఇత‌ర సూక్ష్మ‌క్రిములు నాశ‌న‌మ‌వుతాని పేర్కొన్నారు. ఆయిల్ పుల్లింగ్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వ‌ని చెబుతున్నారు. రోజూ ఉద‌యాన్నేప‌ర‌గ‌డుపున బ్ర‌ష్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె లేదా స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఇత‌ర నూనెల‌తో ప‌దిహేను నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు. రోజూ మూడుసార్లు ఇలా చేస్తే మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement