Frocks | కాలేజీ, ఆఫీసులకు వెళ్లే మగువలను ఆకర్షిస్తున్న నయా గౌన్లు
Designer Frocks | చిట్టిపొట్టి దుస్తులతో పోలిస్తే పొడవుగా, నిండుగా ఉండే గౌన్లను ఇష్టపడతారు ఆధునిక మహిళలు. నిన్నమొన్నటి వరకూ పార్టీలు, ఫంక్షన్లకు మాత్రమే ధరించిన డిజైనర్ ఫ్రాక్‌లు ఇప్పుడు రోజువారీ దుస్తుల్లో చేరిపోయాయి. కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే మగువలకు అనువైన రెండు ఫ్రాక్ డిజైన్లు..
తేలికపాటి పట్టుతో..
బూడిద రంగు తేలికపాటి పట్టు వస్త్రంతో రూపొందించిన ఫ్రాక్ ఇది. అడుగు భాగంలోని రంగుతోనే పై భాగాన్నీ డిజైన్ చేశారు. అదే రంగు కర్దనాతో వీ నెక్ ఇచ్చి ఆల్ ఓవర్ మగ్గం వర్క్ చేశారు. అడుగు భాగం హైలైట్ అయ్యేలా అదే రంగు నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో లేయర్ ఇచ్చారు. అడుగు భాగానికి కాంట్రాస్టింగ్‌గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో సింగిల్ లేయర్ వేవ్ హ్యాండ్స్ జతచేశారు. రఫుల్స్ జోడించిన ఫుల్లెన్త్ హ్యాండ్స్ ట్రెండీ లుక్ ఇచ్చాయి.
నెమలి కంఠం రంగులో..
అందమైన నెమలి కంఠం రంగులో రూపొందించిన ఫ్రాక్ ఇది. అడుగు భాగాన్ని హైలైట్ చేసేలా గోధుమ వన్నె లైట్ వెయిట్ పట్టు వస్త్రంతో యోక్ పార్ట్ డిజైన్ చేశారు. ముందుభాగంలో మెరూన్, మస్టర్డ్ యెల్లో, కృష్ణ కలర్లో చేసిన త్రెడ్‌వర్క్ బాగుంది. డబుల్ పఫ్ ఎల్బో హ్యాండ్స్ ట్రెండీలుక్తో పాటు సంప్రదాయ సౌందర్యాన్ని ఇస్తున్నాయి. అడుగు భాగానికి ప్రాధాన్యం ఇస్తూ.. అదే రంగు నెట్టెడ్ లేయర్ అదనపు ఆకర్షణ.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More ;
“వెండిలా కనిపించే తెల్ల బంగారు నగలే ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

