వెండిలా కనిపించే తెల్ల బంగారు నగలే ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్
White Gold Jewelry | స్వర్ణం.. అంటేనే మిరుమిట్లు గొలిపే పసుపు పచ్చని ఆభరణాలు గుర్తుకొస్తాయి. నిజానికి, బంగారంలోనూ అనేక రకాలున్నాయి. రకరకాల వర్ణ మిశ్రమాలతో వన్నెచిన్నెల కనకం తయారవుతుంది. అందులోనూ.. రోజ్గోల్డ్, బ్లాక్గోల్డ్ నగలు సరికొత్త ఫ్యాషన్. తాజాగా వీటి సరసన చేరింది వైట్గోల్డ్ జువెలరీ.

పచ్చని పసిమి కాంతులను వెదజల్లుతుంది స్వచ్ఛమైన బంగారం. దానికి రకరకాల లోహాలను జోడించి కొత్త వర్ణాలకు ప్రాణంపోస్తున్నారు స్వర్ణకారులు. తెల్లబంగారమూ అలాంటిదే. ఇది అచ్చంగా వెండిని పోలి ఉంటుంది. మెరుపు మాత్రం ఎంతో ప్రత్యేకం. అందుకే వెండి నగలకంటే వైట్గోల్డ్ జువెలరీనే ఇష్టపడతారు అలంకరణ ప్రియులు. ఆ మధ్య కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ అలంకరించుకున్న వజ్రాల కంటె కూడా తెల్ల బంగారంతో తయారైనదే.

బంగారంలో నికెల్, పలాడియం, ప్లాటినం, మాంగనీస్, జింక్, రాగి, వెండి తదితర లోహాలను తగిన మోతాదులో కలిపితే తెల్లబంగారం అవుతుంది. వెండి, ప్లాటినం లోహాలు పేరుకు తెల్లగానే ఉన్నా బంగారంలోని కొన్ని ప్రత్యేకలక్షణాలు ఉండవు. వెండి చాలా మృదువుగా ఉంటుంది. దీంతో సన్నని తీగలతో అల్లే నగల తయారీకి పనికిరాదు. ఇక ప్లాటినం దృఢంగా ఉన్నా.. పెళుసుదనం ఎక్కువ. దీంతో భారీ నగల తయారీకి అనుకూలం కాదు. తెల్లబంగారం మాత్రం వెండితో పోలిస్తే దృఢంగానే ఉంటుంది. దీని స్వచ్ఛతను క్యారెట్లలో లెక్కకట్టవచ్చు.

తెల్లబంగారం తయారీని 1920లోనే ప్రారంభించారు. అప్పటినుంచీ వైట్గోల్డ్ నగలు అందుబాటులో ఉన్నాయి. యూరోపియన్, అమెరికన్ డిజైన్లలో ఈ లోహాన్ని విరివిగా ఉపయోగిస్తారు. వజ్రాలు పొదిగిన చోకర్లు, పెండెంట్లలో మెరుపును పెంచేందుకూ తెల్ల బంగారాన్ని వాడతారు. రోజ్గోల్డ్, వైట్గోల్డ్ కలయికతో తయారైన ఉంగరాలు, చోకర్లు మరింత ప్రత్యేకం. సంప్రదాయ దుస్తులపై ధరించేందుకు వీలుగా భారీ చోకర్లతోపాటు కాంబోలు కూడా వచ్చేశాయి. స్టైలిష్ లుక్ ఇచ్చే వైట్గోల్డ్ ఉంగరాలు, బ్రేస్లెట్లు, పెండెంట్లు, దుద్దులు వెస్ట్రన్వేర్పైనా చక్కగా అమరిపోతాయి.

Read More :
“Modular Jewellery | పెళ్లయినా.. ఎంగేజ్మెంట్ అయినా ఈ నగలే బెస్ట్ ఛాయిస్!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

