లెదర్‌తో తయారు చేసిన బ్యాగులు, బెల్టులు మాత్రమే కాదు.. జువెల్లరీ కూడా ఫేమస్సే !!
Leather Jewellery | లెదర్ అనగానే బ్యాగులు, బూట్లు, బెల్టులు, చెప్పులే గుర్తొస్తాయి. ఫినిషింగ్‌తో రాజసం ఉట్టిపడే వస్తువులను ఇష్టపడతారు.
Leather Jewellery | లెదర్ అనగానే బ్యాగులు, బూట్లు, బెల్టులు, చెప్పులే గుర్తొస్తాయి. చక్కని ఫినిషింగ్‌తో రాజసం ఉట్టిపడే తోలు వస్తువులను చాలామంది ఇష్టపడతారు. ఇవి ఎంతోకాలం మన్నుతాయి కూడా. కాబట్టే, లెదర్ జువెలరీకి అంత ఆదరణ.
జంతు చర్మంతో రకరకాల వస్తువులను తయారు చేసుకోవడం ప్రాచీనకాలం నుంచీ వస్తున్నదే. తోలు వస్తువుల తయారీలో మిగిలే చిన్నచిన్న ముక్కలతో అందమైన ఆభరణాలను తయారు చేస్తున్నారు నవతరం డిజైనర్లు. లెదర్ జాకెట్లు, దుస్తులు కూడా తోడైతే.. వాటికి తిరుగే ఉండదు. తోలు దారాలను కట్టుకోవడం వల్ల దుష్టశక్తులు దరిచేరవనే నమ్మకమూ ఉంది. అందుకనే తోలు ముక్కలను పసిపిల్లల కాలికో, మెడకో వేస్తారు. తేలికగా ఉంటాయి కాబట్టి అసౌకర్యం అనిపించదు. ఒంటికి గుచ్చుకోవు కూడా. బంగారం, వెండి తదితర లోహాలను జోడించి కూడా లెదర్ జువెలరీ తయారు చేస్తారు. వీటికి బంగారం, వెండి పట్టీలను పొందికగా జతచేస్తారు. లెదర్ ముక్కలపై రంగులద్దిన నగలూ బావుంటాయి. పూసలు, గవ్వలు, ముత్యాలు వంటి వాటిని జోడించి కంఠాభరణాలు, గాజులు, కమ్మలు తయారు చేస్తున్నారు. వెస్ట్రన్ డ్రెస్సులపై ధరిస్తే స్టైలిష్ లుక్‌లో మెరిసిపోవడం ఖాయం.

కొంత జాగ్రత్తగా..
లెదర్ నగల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిని ఇతర ఆభరణాల మధ్య పెట్టకూడదు. ప్రత్యేకమైన డబ్బాల్లో ఉంచాలి. నీటిలో తడపకూడదు. పొడి వస్త్రంతో తుడిచి ధరించాలి. ఒకవేళ తడిస్తే పూర్తిగా ఆరిన తర్వాతే డబ్బాల్లో ఉంచాలి. నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. మెరుపు తగ్గకుండా తరచూ పాలిష్ చేయాలి.

Read More :
“Modular Jewellery | పెళ్లయినా.. ఎంగేజ్మెంట్ అయినా ఈ నగలే బెస్ట్ ఛాయిస్!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

