పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కోసం డిజైన్ చేయించిన నగలకు హైదరాబాద్‌కు ఉన్న సంబంధమేంటి?
Aishwarya Rai | రాణి పాత్ర అనగానే గుర్తుకొచ్చేలా ‘జోధా అక్బర్’లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఐశ్వర్యరాయ్. ప్రస్తుతం అలాంటి మరో పాత్రలో నటిస్తున్నదీ నీలికళ్ల సుందరి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో రాణి నందినిగా, రాణి మందాకినీదేవిగా.. ద్విపాత్రాభినయంతో కనికట్టుచేయనున్నది. ఈ చిత్రంలో ఐశ్వర్య ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. ఇందులో, కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఆమె రూపాన్ని తీర్చిదిద్దారు.
రాణెమ్మల కోసం హైదరాబాద్‌లోని కిషన్‌దాస్ అండ్ కో సంస్థతో ఆభరణాలు డిజైన్ చేయించారు. మొత్తం పద్దెనిమిది మంది స్వర్ణకారుల బృందానికి ప్రతీక్షా ప్రశాంత్ చీఫ్ డిజైనర్ వ్యవహరిస్తున్నారు. ఆరునెలలపాటు ఎంతో పరిశోధన చేసి చోళుల కాలంనాటి నెక్లెస్‌లతో పాటు జుంకాలు, వంకీలు, ఉంగరాలు, పాపిట బిళ్లలు, హారాలు తదితరాలకు జీవం పోశారు. ఈ ఆభరణాల సంస్థకు నూట యాభయ్యేళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ నిజాములకు కూడా కిషన్‌దాస్ అండ్ కో నగలను రూపొందించి ఇచ్చేదట. ఆ నగధగలతో మెరిసిపోయే ఐశ్వర్యను వెండితెర మీద చూడాలంటే మాత్రం సెప్టెంబరు దాకా ఆగాల్సిందే!
Read More :
Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?
Ram Gopal Varma | రామ్‌గోపాల్ వర్మపై కోర్టుకు..! కారణం ఏంటంటే..?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

