Aadhi Pinisetty | ప్రేక్షకుల రియాక్షన్ చూసి థ్రిల్ అయ్యాను : ఆదిపినిశెట్టి
లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ది వారియర్(The Warriorr) లో విలన్‌గా మెరిశాడు టాలెంటెడ్ యాక్టర్ ఆదిపినిశెట్టి (Aadhi Pinisetty) .
గుండెల్లో గోదావరి, రంగస్థలం, సరైనోడు లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ నటుడు ఆదిపినిశెట్టి (Aadhi Pinisetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో రామ్ (Ram Pothineni) హీరోగా నటించిన ది వారియర్(The Warriorr) లో విలన్‌గా మెరిశాడు. గురు పాత్రలో నటించాడు.
ది వారియర్ చిత్రానికి వస్తున్న రియాక్షన్ చూసి థ్రిల్ అయ్యానంటున్నాడు ఆదిపినిశెట్టి. గురు రోల్‌కు తాను కమర్షియల్ టచ్ ఇచ్చానని, ఈ పాత్ర కోసం చాలా హోం వర్క్ చేశానన్నాడు. లింగుస్వామి సినిమాల్లో విలన్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. సినిమాలో వచ్చే చాలా సన్నివేశాల్లో డామినేట్ చేసేందుకు అవకాశమిచ్చిన రామ్‌కు నిజంగా థ్యాంక్స్ చెప్పాలన్నాడు ఆదిపినిశెట్టి. తన యాక్టింగ్ చూసిన నాన్న రవిరాజా పినిశెట్టి చాలా మెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిశెట్టి, కన్నడ బ్యూటీ అక్షర గౌడ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించగా..నదియా కీలక పాత్రలో నటించారు. మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం జులై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ హీరో కమ్ విలన్ ప్రస్తుతం శివుడు అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Read Also : Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

