తన యాక్టింగ్‌తో 90లలో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీని షేక్ చేసింది బాలీవుడ్ (Bollywood) భామ కాజోల్ (Kajol). 5 పదుల వయస్సు దగ్గరకొస్తున్నా వన్నె తరగని అందంతో ఈ భామ కొత్త హీరోయిన్లకు మంచి పోటీనిస్తుంది. కాజోల్ తమిళంలో కూడా మెరిసింది. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటిన బీటౌన్ స్టార్ హీరోయిన్లు కరీనా కపూర్, కరీష్మా కపూర్, మాధురీ దీక్షిత్ డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో కాజోల్ కూడా చేరిపోయింది. డిస్నీ+హాట్ స్టార్ థ్రిల్లర్ షో ( Disney Hotstar thriller) ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది కాజోల్. ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు బీటౌన్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సిరీస్ షూటింగ్ సోమవారం ముంబైలో మొదలైంది.
ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సిరీస్‌ను సుపర్ణ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. కాజోల్ ప్రస్తుతం రేవతి దర్శకత్వంలో సలామ్ వెంకీ సినిమా చేస్తోంది.