Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
హీరో కమ్ కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? చంద్రముఖి (Chandramukhi) బాక్సాపీస్ ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అంటే అభిమానులెంతమంది ఉన్నారో చెప్పడం కష్టమే. తలైవా అభిమానుల జాబితాలో టాప్‌లో ఉంటాడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence). ఈ హీరో కమ్ కొరియోగ్రాఫర్ తాజాగా రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? రజినీకాంత్ , పి వాసు (P Vasu) కాంబినేషన్లో వచ్చిన చంద్రముఖి (Chandramukhi) బాక్సాఫీస్ ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మళ్లీ దశాబ్దమున్నర కాలం తర్వాత సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతుంది. ఇందులో రాఘవా లారెన్స్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇవాళ చంద్రముఖి 2 షూటింగ్ మైసూర్లో షురూ కాబోతుంది. ఈ సందర్భంగా తలైవా ఇంటికెళ్లిన లారెన్స్ ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ..సినిమా మొదలవుతున్న సందర్భంగా నా గురువు తలైవా ఆశీస్సులు తీసుకున్నా. మీ దీవెనలు కూడా కావాలి..అని ట్వీట్ చేశాడు లారెన్స్.
లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తొలి పార్టును డైరెక్ట్ చేసిన పి వాసు చంద్రముఖి 2 (Chandramukhi 2)కు కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన సీక్వెల్ లుక్స్ క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. లెజెండరీ కమెడియన్ వడివేలు కీ రోల్ చేస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా..తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Hi friends and fans, Today Chandramukhi 2 shooting begins in Mysore with my Thalaivar and guru’s @rajinikanth blessings! I need all your wishes! 🙏🏼🙏🏼 #Chandramukhi2 pic.twitter.com/dSrD3B5Xwh
— Raghava Lawrence (@offl_Lawrence) July 15, 2022
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

