Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?
Keerthy Suresh Favorite Actor | వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన నటనతో జీవం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ చిత్రంతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తీ కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్‌లుగా నిలిచాయి. చాలా కాలం తర్వాత సాని కాదియం సర్కారు వారి పాటతో వరుసగా రెండు హిట్లను సాధించింది.
తాజాగా కీర్తి ఓ ఇంటర్వూలో భాగంగా తన ఇష్టాలని పంచుకుంది. కీర్తికి విజయ్ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని తెలిపింది. కార్తీ, జయంరవి లాంటి నటులతో పనిచేయాలనుందని మనసులో మాటను బయటపెట్టింది. అంతేకాకుండా రాజమౌళి, మణిరత్నం, శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందని తెలిపింది. బరువుతగ్గడంపై స్పందించి.. మహానటి తర్వాత ఏడు నెలలు ఇంట్లోనే ఉన్నానని, ఆ సమయంలో కసరత్తులతో పాటు ఆహారపు కట్టుబాట్లు పాటించానని తెలిపింది. ఇక రెమ్యునరేషన్ తెలుగు, తమిళంలో ఒకే విధంగా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈమె మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మామన్నన్’ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రాధాన పాత్రలో నటిస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగులో నానితో ‘దసరా’, చిరుతో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

