Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?
Kiran Abbavaram New Movie Release Date | ఫలితం ఎలా ఉన్నా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే ‘సమ్మతమే’ చిత్రంతో మరో హిట్‌ను సాధించాడు. ప్రస్తుతం కిరణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఒకటి. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి నుండి ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. కానీ ఇటీవలే విడుదలైన టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీను కిరణ్ అబ్బవరం వెల్లడించాడు.
నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లేజెండ్ దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య, దీప్తి నిర్మిస్తున్నారు. కాగా అదే రోజు రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మస్త్ర’ విడుదల కానుంది. ఈ చిత్రానికి హిందీతో సమానంగా ఇక్కడ కూడా బజ్ ఏర్పడింది. పైగా ఈ చిత్రంలో నాగార్జున ముఖ్య పాత్రలో నటించడం.. రాజమౌళి ఈ చిత్రాన్ని విడుదల చేయడం వంటివి సినిమాపై మంచి బజ్జ్ను క్రియేట్ చేశాయి. మరి ఈ పోటీని తట్టుకుని కిరణ్ బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొడతాడా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం కిరణ్ ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాలను చేస్తున్నాడు. ఈ మూడు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Sep 9th ❤️@kodidivya @KodiDivyaaEnt pic.twitter.com/0V0F3dfgV6
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 15, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

