పూల పూలతో ట్రెండీగా ఉన్న కొత్త రకం రెయిన్ కోట్స్‌ని ట్రై చేశారా?
Fashion Rain Coats | వానాకాలం వచ్చిందంటే ముసుర్లు మొదలవుతాయి. మూడు నాలుగు రోజుల నుంచి వారం పదిరోజుల దాకా జల్లులు మనల్ని తడుపుతూనే ఉంటాయి. వర్షం సాకుతో బడి ఎగ్గొట్టినట్టు అన్ని పనులూ మానేస్తామంటే కుదరదుగా. అందుకే బయట తిరగాల్సిందే. తడిసి ఆరాల్సిందే! జల్లు పడగానే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా… అంటూ పాటపాడి డ్యాన్సు చేసే సరదా ఉన్నవాళ్లయినా సరే… రోజూ వానలోకెళ్తే దవాఖానలో అడుగుపెట్టాల్సి వస్తుంది. కాబట్టే ఈ సమయంలో రెయిన్కోట్లకు అంత డిమాండ్. అందులోనూ కొత్తగా వస్తున్న ట్రెండీ, ఫ్యాషనబుల్ రెయిన్కోట్లు యూత్‌ను మరింత ఆకర్షిస్తున్నాయి.

చినుకుల్లో ఫ్యాషన్‌గా…
ఆకలేస్తే అన్నం తినాలి, వానొస్తే రెయిన్‌కోట్ వేసుకోవాలి. అలాగని రోజూ ఒకే కూరతో అన్నం తినలేము, ఎప్పుడూ ఒకేలా ఉండే రెయిన్కోట్లూ కొనుక్కోలేము. ఈ విషయాన్ని అర్థం చేసుకునే డిజైనర్లు అవసరం కోసం వేసుకునే రెయిన్కోట్లనూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అటు అమ్మాయిలూ, ఇటు అబ్బాయిలకు విడివిడిగా విభిన్న మోడళ్లు రూపొందిస్తున్నారు. అమ్మాయిల కోసం అచ్చం కుర్తీలా కనిపిస్తూ దానిమీద రకరకాల పూలూ తీగలూ ఉండేలా చూస్తున్నారు. రంగురంగుల్లో రకరకాల డిజైన్లతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటున్నాయి. కుర్తీల తరహాలో పోల్కాడాట్స్ ప్రింట్ చేసినవీ ఉన్నాయి. పొడవు చేతులున్నవీ, రెక్కల తరహాలో వస్తున్నవీ.. ఇలా రకరకాలు ఉంటున్నాయి. ఇక, అబ్బాయిల కోసమూ పార్టీ వేర్ తరహాలో కనిపించేలా గ్రాఫిక్ ప్రింట్లతో రెయిన్కోట్లు తయారవుతున్నాయి. మొత్తానికి ఇవి వేసుకుంటే వానకు తడిసినా మెరుపులా మెరిసిపోతామన్నమాట!

Read More :
“Stone Carving Jewellery | ఈ రాతి నగలు ధరిస్తే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా?”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

