e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News national law day | అన్ని రంగాల్లో రాణిస్తున్న మ‌హిళ‌లు లాయ‌ర్లుగా ఎందుకు కాలేక‌పోతున్నారు?

national law day | అన్ని రంగాల్లో రాణిస్తున్న మ‌హిళ‌లు లాయ‌ర్లుగా ఎందుకు కాలేక‌పోతున్నారు?

national law day ( నేడు జాతీయ న్యాయ దినోత్సవం ) | మహిళా.. న్యాయవాదిగా నువ్వు నల్లకోటు ధరించాలి. పురుషాధిక్య సమాజం తెల్లబోయేలా వాదించాలి. మహిళా..న్యాయమూర్తిగా నువ్వు వ్యవస్థలోని లోపాల పాపాలు కడిగేయాలి. ‘ఆర్డర్‌ ఆర్డర్‌’ అంటూ ధర్మాగ్రహం ప్రకటించాలి.

national law day

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సముద్రాలను ఈదుతున్నారు. అంతరిక్షాన్ని శోధిస్తున్నారు. ఆకాశాన్ని కొలుస్తున్నారు. పర్వతాలను పాదాక్రాంతం చేసుకుంటున్నారు. డాక్టర్లుగా ప్రాణాలను నిలుపుతున్నారు. ఇంజినీర్లుగా ప్రాజెక్టులకు రూపం ఇస్తున్నారు. దేశ రక్షణలోనూ భాగం అవుతున్నారు. న్యాయవాద వృత్తిలో మాత్రం.. ఉనికిని చాటుకుంటున్నా ఈ రంగాన్ని శాసించలేకపోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం.

ప్రధాన అవరోధాలు

 • వృత్తిలో సమాన అవకాశాలు లేకపోవడం.
 • మహిళల నైపుణ్యాలపై క్లయింట్లకు అపనమ్మకం.
 • సొంతంగా ప్రాక్టీసు పెట్టుకునే ఆర్థిక వెసులుబాటు లేకపోవడం.
 • లింగ వివక్ష.
 • కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభించకపోవడం.
 • పిల్లల బాధ్యతలు, కుటుంబ నిర్వహణ.

అవకాశాలు ఇవీ..

- Advertisement -

అవరోధాలను అధిగమించి.. నల్లకోటు వేసుకోగలిగితే న్యాయశాస్త్ర పట్టభద్రులకు అనేక అవకాశాలు. పోటీ పరీక్షల ద్వారా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపిక కావచ్చు. సమాజంలో చట్టాలు, హక్కులపై అవగాహన పెరగడం వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా న్యాయ సలహాదారులను నియమించుకుంటున్నాయి.

మహిళల్లో స్వతహాగా వాదనా పటిమ ఎక్కువ. స్పందించే గుణం అధికం. పురుషులతో పోలిస్తే.. ఓపికా, సహనమూ అపారమే. నిజానికి న్యాయవాదం వృత్తి మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా. ఏ సంక్షోభమైనా సరే మొదటి బాధితురాలు మహిళే. గృహ, లైంగిక హింసలకు గురవుతున్న వారూ ఆడబిడ్డలే. వారి తరఫున, ఓ స్త్రీ కోణంలో వాదించేవారు ఎంతమంది ఉన్నారంటే.. చెప్పలేం. న్యాయవాద వృత్తిలో మహిళల బలం పెరిగితే లైంగిక హింసకు సంబంధించిన కేసులలో సత్వర విచారణకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు చేస్తున్నా, అమలు మాత్రం అరకొరగానే ఉంటున్నది. ఆ చట్టాలను సమీక్షించడానికి, ఆ లోపాలను మహిళల కోణంలో ఎత్తి చూపడానికి మరింతమంది మహిళా న్యాయమూర్తుల అవసరం ఉంది. సమాజంలోని సాంఘిక దురాచారాలపై వాదనలు వినిపించడంలో కూడా మహిళా న్యాయవాదుల పాత్ర కీలకమైందే.

ఇదీ పరిస్థితి

 • సుప్రీంకోర్టు ఏర్పాటైన 71 సంవత్సరాలలో నియమితులైన న్యాయమూర్తుల సంఖ్య 256. అందులో మహిళలు కేవలం 11 మంది (4.2 శాతం)
 • ప్రస్తుతం 34 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంలో మహిళల సంఖ్య 4 (11 శాతం). ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
 • వివిధ హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్య 677. అందులో మహిళలు 81 మంది (11.5శాతం). ఐదు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.
 • బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో మహిళలే లేరు, రాష్ర్టాల కౌన్సిల్‌లలో రెండు శాతం.
 • దేశవ్యాప్తంగా న్యాయవాదుల సంఖ్య 17లక్షలు. అందులో మహిళలు 15 శాతం.
 • తెలంగాణలో న్యాయవాదుల సంఖ్య 48,875. అందులో మహిళలు 18.04 శాతం.

ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం చాలా దారుణంగా ఉంది. స్వతంత్రం వచ్చిన 75 ఏండ్ల తరువాత కూడా అతి కష్టం మీద సుప్రీంకోర్టులో 11 శాతం ప్రాతినిధ్యాన్ని మాత్రమే సాధించగలిగాం. ఈ విషయంపై దృష్టి పెట్టాలి. దీనిపై చర్చ జరగాలి. న్యాయ వ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు ఉండాలి. ఇది మీ హక్కు. ఆ రిజర్వేషన్లను మీరు డిమాండ్‌ చేయాలి.

– జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సమాన అవకాశాలు కావాలి

న్యాయవాద వృత్తిలో మహిళలు వెనకబడటానికి ప్రధాన కారణం.. సమాన అవకాశాలు లేక
పోవడం. ఉదాహరణకు.. న్యాయవ్యవస్థలో రెండు రకాలుగా నియామకాలు ఉంటాయి. 60 శాతం పరీక్షల ద్వారానే జరుగుతాయి. రిజర్వేషన్లు అమలవుతాయి. ఫలితంగానే ఈ మాత్రమైనా మహిళా న్యాయవాదులు రాగలుగుతున్నారు. మిగతా 40 శాతం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుంది. ఇక్కడ వివక్ష ఎక్కువ. మహిళలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో స్త్రీలు వెనకబడిపోతున్నారు. సమాన అవకాశాలను కల్పించినప్పుడే, మరింత మంది న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు ముందుకు వస్తారు.

– పి. రేవతి, ప్రెసిడెంట్‌

తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వుమెన్‌ లాయర్స్‌ పక్కాగా ఉండాలి

మహిళా న్యాయవాదులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఫ్యామిలీ కోర్టులు, లీగల్‌ సెల్‌ సర్వీస్‌ అథారిటీల వంటి వాటిలో ప్రాధాన్యమివ్వాలి. న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన మహిళ నిలదొక్కుకునేంత వరకు ఉపకార వేతనాలు అందించాలి, ఆర్థిక భరోసానివ్వాలి. రక్షణకు, సంక్షేమానికి రూపొందించిన చట్టాలను పక్కాగా అమలు చేయాలి. పురుషుడితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి.

– రజితారెడ్డి, హైకోర్టు న్యాయవాది


…? మ్యాకం రవికుమార్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళ‌న చేశారు.. కానీ..

మీ పెంపుడు జంతువులు..ఇక తప్పిపోవు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement