justice ayesha malik | జస్టిస్ ఆయేషా మాలిక్ (55) పాకిస్థాన్ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. పురుషాధిక్య పాక్ సుప్రీంకోర్టుకు ఓ మహిళ న్యాయమూర్తిగా రావడాన్ని ప్రపంచ దేశాలన్నీ స్వాగతిస్తున్నాయి. కాకపోతే, ఈ నిర్ణయంతో సైన్యం, న్యాయవ్యవస్థ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఆయేషా హార్వర్డ్ లా స్కూల్లో చదువుకున్నారు. మహిళల హక్కుల కోసం గళమెత్తారు. ఆయేషా ఎంపికను పాకిస్తాన్‌లోని ఉదారవాదులు స్వాగతిస్తుండగా, బార్ కౌన్సిళ్లు నిరసిస్తున్నాయి. నలుగురు సీనియర్ న్యాయమూర్తులను పక్కనపెట్టి మరీ ఆమెకు పదోన్నతి కల్పించారన్నది బార్ కౌన్సిల్ ఆరోపణ. ప్రస్తుతం లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయేషా గత ఏడాది, అత్యాచార కేసులలో బాధితురాళ్ల కన్యత్వ పరీక్షను తప్పుపడుతూ తీర్పు ఇచ్చారు. ఆయేషా నియామకాన్ని పాక్ ప్రభుత్వం ఆమోదిస్తే, ఆమె 2031 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అన్నీ కుదిరితే, 2030లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠమెక్కే అవకాశమూ ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?