Men Feel Period Pain | సోషల్ మీడియాలో ఎన్నో చాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే జనం ఆలోచనల్లో ఎంతోకొంత మార్పు తీసుకొస్తాయి. అలాంటిదే ‘మెన్ ఫీల్ పీరియడ్ పెయిన్’ (#ఫీల్ ది పెయిన్ – Feel the Pain ). కొచ్చిలో లులూ మాల్ సుప్రసిద్ధం. ఎంతోమంది వస్తుంటారు. ఓ యువతి హెడ్సెట్ లాంటి ఓ పరికరాన్ని అక్కడికి తీసుకొచ్చింది.
ఓ యువకుడికి ఏం చెప్పిందో ఏమో.. అతను ఆ డివైజ్ వైర్లను పొత్తికడుపునకు అతికించుకున్నాడు. ఆమె ఫస్ట్ బటన్ నొక్కగానే.. గిలిగింతలు పెట్టినట్లు నవ్వాడు. రెండో బటన్ నొక్కగానే ఏదో తెలియని నొప్పి మొదలైంది. మూడో బటన్‌తో ముఖ కవళికలు మారిపోయాయి. నాలుగో బటన్ దెబ్బకు నొప్పితో గింజుకున్నాడు. ఐదో బటన్ నొక్కగానే.. ‘ప్లీజ్ ఆపెయ్’ అంటూ గిలగిలా కొట్టుకున్నాడు. ఆ బాధ చూడలేక ఆ యువతి స్విచ్ ఆఫ్ చేసింది. ఆ పరికరం పేరు ‘పీరియడ్ పెయిన్ సిమ్యులేటర్ ( Period Pain Simulator )’. రుతుస్రావ సమయంలో మహిళలు భరించే నొప్పిని పురుషుడికి పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) #Feelthepain పేరుతో దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో మహిళలు పీరియడ్స్ సమయంలో అనుభవించే నొప్పిని 4 నుంచి 10 దశల్లో చూపిస్తారు. మహిళలు 8 నుంచి 9 దశల వరకు ఆ నొప్పిని సునాయాసంగా భరించగలరు. పురుషులు మాత్రం ఆరో దశకే కుప్పకూలిపోతున్నారు.
“పీరియడ్స్‌లో సమస్యలా? ఈ యోగాసనాలు వేస్తే మంచిదట!!”