Rtu Vidya Book by Sinu Joseph | రుతుస్రావంపై మన దేశంలో ఉన్నన్ని అపోహలు ఎక్కడా ఉండవేమో! గుడిలోకి వెళ్లకూడదు, మసాలాలు తినకూడదు, బొప్పాయి, పెరుగు ముట్టనే కూడదు, వంట జోలికి వెళ్లనే కూడదు. ‘రుతు విద్య’ రచయిత్రి సీను జోసెఫ్ వాటిలోని అనేక మూఢ నమ్మకాలను పటాపంచలు చేస్తున్నారు. దేశమంతా తిరుగుతూ, స్థానికులతో మాట్లాడుతూ తన ఆలోచనలకు పుస్తకరూపం ఇచ్చారు సీను జోసెఫ్. మైత్రీ స్పీక్స్ అనే సంస్థను స్థాపించి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు రుతుక్రమంపై పాఠాలు కూడా బోధిస్తున్నారు. తన పుస్తకంలో అంతులేని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చారు. రుతుక్రమ నమ్మకాల వెనుక ఉన్న శాస్త్రీయతను ప్రశ్నించారు. కొన్ని నమ్మకాలను గౌరవించారు కూడా. గత నెలలో విడుదలైన ఈ పుస్తకం.. పాఠకులకు ఓ కొత్త దృక్పథాన్ని పరిచయం చేస్తుంది.
Read More :
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా