ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?
Srikanth Bolla | ఆ ప్రతిభ.. అనన్య సామాన్యం. ఆత్మవిశ్వాసం.. పెట్టని ఆభరణం. అంధుడైనా.. అవధులు దాటుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగాడా యువ కిశోరం. అందుకే, అతడి జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు బాలీవుడ్ ఆరాటపడుతున్నది. ‘ఎవరీ శ్రీకాంత్ బొల్ల?’ అంటూ గూగులమ్మను వివరాలు అడుగుతున్నది.

బాలీవుడ్‌కు బయోపిక్‌లు కొత్త కాదు. కానీ, ఓ తెలుగు వ్యక్తి సాధించిన విజయాల గురించి బాలీవుడ్లో సినిమా రావడం మనకూ గర్వకారణమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సుపరిచితుడైన ఆ ప్రతిభావంతుడే.. శ్రీకాంత్ బొల్ల. మచిలీపట్నానికి చెందిన ఈ వ్యాపారవేత్త జీవిత గాథ ఆధారంగా త్వరలోనే ఓ సినిమా రాబోతున్నది. ప్రతిభకు అంధత్వం అడ్డుకాదని నిరూపించిన శ్రీకాంత్.. మసాచుసెట్స్ యూనివర్సిటీలో బిజినెస్ డిగ్రీ పొందారు. ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’ పేరుతో ఏపీ, తెలంగాణలలో పరిశ్రమలను స్థాపించి, రూ.150 కోట్ల టర్నోవర్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రయాణాన్నంతా బాలీవుడ్ సినిమాగా తీసుకు రానున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ పోషిస్తున్నారు. తుషార్ హీరానందని దర్శకులు. భూషణ్ కుమార్, నిధి పర్మర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. మిగతా తారాగణాన్నీ అప్పుడే ప్రకటిస్తారు.
ఎవరీ శ్రీకాంత్?
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని సీతారామపురం శ్రీకాంత్ స్వగ్రామం. తల్లిదండ్రులు దామోదర్ రావు, వెంకటమ్మ వ్యవసాయ కూలీలు. జన్మతః అంధుడైన శ్రీకాంత్.. బాల్యంలోనే కన్నవారి రెక్కల కష్టాన్ని అర్థం చేసుకొన్నారు. తన వైకల్యాన్ని అధిగమించి, చదువులో రాణించారు. తరగతి గదిలో గురువులు పట్టించుకోపోయినా, వెనుక బెంచీలో కూర్చోబెట్టినా బాధపడలేదు. ఆటపాటలకు దూరంగా ఉంచినా, అడుగడుగునా అవమానాలు ఎదురైనా కుంగిపోలేదు. అన్నిటినీ అధిగమిస్తూ తానేమిటో నిరూపించుకున్నారు.

లక్షల వేతనం వదిలేసి..
ఎంఐటీలో చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోని పలు కంపెనీలు శ్రీకాంత్‌కు లక్షల జీతాన్ని ఆఫర్ చేశాయి. వాటన్నిటినీ వదిలేసి, భారత్‌లో తనలా ఇబ్బందులు పడుతున్నవారి కోసం ఏదైనా చేయాలని తిరిగొచ్చారు. కొన్నాళ్లు పరిశోధనలు చేసి, హైదరాబాద్ కేంద్రంగా ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’ పేరుతో పరిశ్రమను స్థాపించారు. అందులో ఉద్యోగులుగా 80 శాతం దివ్యాంగులనే నియమించుకున్నారు. పేపర్ ప్లేట్లు, గ్లాసులు తయారు చేయడం ప్రారంభించారు. 2012లో ప్రారంభమైన ఈ పరిశ్రమ అద్భుతమైన పురోగతిని సాధిస్తూ.. ఏడాదికి రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌కు చేరుకుంది. పారిశ్రామికవేత్తలు రతన్‌టాటా, రవి మంతా ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’లో పెట్టుబడులు పెట్టడంతో ప్రొడక్షన్ ప్లాంట్లను విస్తరించారు శ్రీకాంత్. హైదరాబాద్, హుబ్లీ, నిజామాబాద్ కేంద్రంగా ఈ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కొన్ని ప్లాంట్లను ఏపీ, కర్ణాటకలో ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం హైదరాబాద్‌లో ‘సమన్వయ్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంధుల కోసం డిజిటల్ లైబ్రరీని, బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ను నెలకొల్పారు. అక్కడ మూడు వేల మందికి పైగా అంధులకు స్వయంగా పాఠాలు చెబుతున్నారు. ఇప్పటికే ఎనిమిది లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 2,500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ‘అమెరికాలో ఎన్నో అవకాశాలున్నా నేను భారత్‌కు తిరిగిరావడానికి కారణం ఒక్కటే! సబ్సిడీ గురించి నేతలు మాట్లాడతారు. తిరిగి అదే సబ్సిడీని పేదలకు అందకుండా చేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకే నైపుణ్యం కలిగిన భారతీయ యువతను స్వయం ఉపాధివైపు నడిపించాలి’ అని పిలుపునిస్తున్నారు శ్రీకాంత్ బొల్ల.

‘సైన్స్’ కోసం పోరాటం..
శ్రీకాంత్ ఇంటర్లో సైన్స్ గ్రూపులో చేరేందుకు వెళ్లారు. అక్కడా అవమానాలే. ఎడ్యుకేషన్ బోర్డు నియమావళి ప్రకారం అంధులు సైన్స్ గ్రూపుల్లో చేరేందుకు అనర్హులు. అయితే, పట్టువిడువని విక్రమార్కుడిలా బోర్డుకు వ్యతిరేకంగా పోరాడారు శ్రీకాంత్. దీంతో ఆరు నెలల్లో బోర్డు దిగొచ్చి, ప్రవేశం కల్పించింది. ఇంటర్లో 98 శాతం మార్కులతో పాసై, తనను అవమానించిన వారితోనే ‘శభాష్’ అనిపించుకున్నారు. ఆ తర్వాత ఐఐటీ అర్హత పరీక్ష కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అక్కడా చుక్కెదురే. హాల్ టికెట్ కూడా పంపకుండా ఐఐటీలు అవమానించాయి. పోరాటాన్ని ఓ అలవాటుగా చేసుకున్న శ్రీకాంత్.. ఐఐటీలనే తిరస్కరించారు. అంతర్జాతీయ విద్యాసంస్థలపై దృష్టి పెట్టారు. అమెరికాలోని టాప్ కాలేజీలకు దరఖాస్తు చేయగా.. ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్ బర్కిలీ, కార్నెగీ మెల్లాన్ వంటి దిగ్గజ విద్యాసంస్థలు శ్రీకాంత్‌కు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చేరారు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చేరిన తొలి అంధ విద్యార్థిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
రతన్ టాటా భుజాలపై చేయి వేసి మరీ మాట్లాడగలిగే ఈ వ్యక్తి గురించి తెలుసా
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

