e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News రైతుల‌కు అండ‌గా తెలంగాణ‌ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా

రైతుల‌కు అండ‌గా తెలంగాణ‌ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా

Agriculture Hackathon | సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు టెక్నాలజీయే సర్వస్వం. ఐటీ కారిడారే ప్రపంచం. కథంతా కంప్యూటర్లతోనే. కానీ, కొందరు తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పొలంబాట పడుతున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి అగ్రికల్చర్‌ హ్యాకథాన్‌ను నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారు!

Agriculture Hackathon
Agriculture Hackathon


వ్యవసాయాన్ని కుదేలు చేస్తున్న వివిధ సమస్యలకు తిరుగులేని పరిష్కారం చూపేందుకు.. సేద్యాన్ని లాభాల బాట పట్టించేందుకు.. దేశంలోనే తొలిసారిగా అగ్రి హ్యాకథాన్‌కు శ్రీకారం చుట్టింది తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా). నారాయణపేట్‌ జిల్లా ఊట్కూర్‌ మండలం యడవల్లిలో ఈ హ్యాకథాన్‌ ప్రారంభమైంది.

Agriculture Hackathon

సమస్యల పరిష్కారం

- Advertisement -

ఆడిటోరియంలోనో, వర్చువల్‌ పద్ధతిలోనో హ్యాకథాన్లు నిర్వహిస్తుంటారు. అగ్రికల్చరల్‌ హ్యకథాన్‌ అలా కాదు. ప్రత్యక్షంగా పొలంలో దిగాల్సిందే. అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సిందే. ఇదో కొత్త తరహా సాంకేతిక సవాలు. హ్యాకథాన్‌లో పాల్గొనేవాళ్లంతా బృందాలుగా విడిపోతారు. ఒక్కో బృందానికి రెండెకరాల భూమిని కేటాయిస్తారు. సభ్యుల్లో ఒక్కొక్కరికి ఎనిమిది గుంటల భూమిని సమానంగా విభజిస్తారు. హ్యాకథాన్‌లో పాల్గొనే సభ్యులు అందులో తమకు నచ్చిన పంటను సాగు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో వారికి సేద్యంలోని సమస్యలూ తెలుస్తాయి.
చీడపీడల బాధ అర్థం అవుతుంది. నేల స్వభావాలు గ్రహిస్తారు. ఆర్థిక పరిమితులు ఎరుకలోకి వస్తాయి. వాతావరణ పరిస్థితులను అంచనావేయడం అలవాటు అవుతుంది. అందరూ నిపుణులే కాబట్టి, ఆ సమస్యకు టెక్నాలజీ సాయంతో పరిష్కారం వెతుకుతారు. వ్యవసాయరంగ సంక్షోభాలకు హ్యాకథాన్‌ ద్వారా పరిష్కారం అందిస్తారు. టెక్కీలు బురదలోకి దిగడం వల్ల నేరుగా వ్యవసాయాన్ని అధ్యయనం చేసే వీలు ఉంటుంది.

Agriculture Hackathon

45 రోజుల పాటు

ప్రతి హ్యాకథాన్‌ గ్రూప్‌లో అగ్రికల్చర్‌ ఇంజినీర్లు కూడా ఉంటారు. 45 రోజులపాటు సాగే ఈ హ్యాకథాన్‌లో భాగంగా మొదటి దశలో వ్యవసాయానికి అనువుగా పొలాన్ని దున్నుతారు, నాటుకు సిద్ధం చేస్తారు. ఇప్పటికే ఒక బ్యాచ్‌ మొదటి దశను పూర్తిచేసింది. రెండో దశ నడుస్తున్నది. ఈ దశలో పంటను వేస్తారు. దీని తర్వాత మూడు, నాలుగు దశలు ఉంటాయి. ఈ దశల్లో పంటకోత ప్రక్రియ ఉంటుంది. హ్యాకథాన్‌లో దీర్ఘకాలిక పంటల జోలికి వెళ్లరు. తక్కువ కాలపరిమితి కలిగిన పంటలనే ఎంచుకుంటారు. అగ్రికల్చరల్‌ హ్యాకథాన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లంతా వారాంతాల్లో పొలంబాట పడతారు. మొదటిదశలో 60 మంది ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఎద్దులు, ట్రాక్టర్లతో పొలాన్ని దున్నారు.

Agriculture Hackathon

‘గ్లోబల్‌ సమ్మిట్‌’ అభినందన

ఈ వినూత్న విధానానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌, తెలంగాణ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ కలిసి శ్రీకారం చుట్టాయి. టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ కుమార్‌ మఖ్తల హ్యాకథాన్‌కు సారథ్యం వహిస్తున్నాడు. వ్యవసాయం, గ్రామీణం, ఉపాధి రంగాల్లో సందీప్‌ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జైమఖ్తల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థులకు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ ఇప్పించాడు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, కమ్యూనికేష్‌ స్కిల్స్‌లో సెమినార్లు నిర్వహించాడు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ లాంటి పేరున్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

gauthami jeji | బొల్లి మ‌చ్చ‌లు ఉన్నాయ‌ని కుంగిపోలేదు.. మోడ‌లింగ్‌లో అద‌ర‌గొడుతుంది..

Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Anshul Gupta | ఆ 1200 మంది మ‌హిళ‌ల వెనుక ఒక్క‌డు..

మూడేండ్ల క్రితం దాకా టీ పెట్ట‌డం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్ట‌ర్ చెఫ్‌

Gray hair | చిన్న‌వ‌య‌సులోనే త‌ల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్‌స్పిరేష‌న్‌.. ఎందుకంటే?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement