Prastuti Designs | 1200 మంది మహిళలు. ఎవరూ అక్షరాస్యులు కాదు. ఒక్కరికీ టెక్నాలజీపై అవగాహన లేదు. కానీ.. ఏండ్ల నాటి కళను బతికిస్తున్నారు. ‘ప్రస్తుతి డిజైన్స్’ ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని మూడు యూనిట్స్‌లో ‘ప్రస్తుతి డిజైన్స్’ సంస్థ నడుస్తున్నది. పెటిట్ పాయింట్, గారా ఎంబ్రాయిడరీ కళను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతున్నదిక్కడ. చెక్క ఫ్రేమ్‌పై వస్ర్తాన్ని పెట్టుకొని సూదితో కుట్టే నైపుణ్యమైన పని ఇది. ప్రియా చటర్జీ, రీటా మండాల్, ఫల్గుణి, మైత్రితో పాటు మరో వంద మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంబ్రాయిడరీలో పట్టుదారంతో పూలు, ఆకులు, పక్షులను తయారుచేయడంలో ప్రియ దిట్ట. సెలబ్రిటీల ఫొటోలను వస్ర్తాలపై డిజైన్ చేయడం మైత్రి ప్రత్యేకత. ఈ వస్ర్తాల ధర రూ.15,000 పైమాటే. గరిష్ఠ ధర లక్షల్లో ఉంటుంది. వీళ్లంతా గిరిజన మహిళలు. మిడ్నాపూర్, హుగ్లీ, బంకురా జిల్లాల్లోని కుగ్రామాల నుంచి పని కోసం వచ్చినవాళ్లు. చీరలు, శాలువాలు, దుపట్టాలపై పెటిట్ పాయింట్, గారా ఎంబ్రాయిడరీతో హంగులద్దుతున్నారు.
గారా అనేది విదేశీ ఎంబ్రాయిడరీ స్టయిల్. పెండ్లిళ్లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ‘గారా’ ధరిస్తారు. పార్సీలో చీరను గారా అంటారు. ఓ పార్సీ వ్యాపారవేత్త చైనాకు వెళ్లినప్పుడు గారా ఎంబ్రాయిడరీని తీసుకొచ్చాడని అంటారు. ఈ డిజైన్స్‌లో వృక్ష, జంతుజాలం స్పష్టంగా కనిపిస్తాయి. మరొకటి.. పెటిట్ పాయింట్ ఎంబ్రాయిడరీ. దీన్ని ఫ్రాన్స్ ఎంబ్రాయిడరీగా చెప్తారు. అప్పట్లో యూరోపియన్ సెటిలర్లు, మిషనరీ సిబ్బంది దీనిని ఇండియాకు తీసుకొచ్చారు. పెటిట్ పాయింట్ ఎంబ్రాయిడరీలో ఒక చదరపు అంగుళం విస్తీర్ణంలో దాదాపు 1000 కుట్లు వేస్తారు. ఈ డిజైన్స్ చాలా సమయం తీసుకుంటాయి. ఒక చీర తయారీకి దాదాపు 1500-5000 గంటలు పడుతుంది. పదీ
పన్నెండు మంది మహిళలు అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుంది. యంత్ర సహాయం అస్సలు తీసుకోరు. మొత్తంగా చేతి పనే.
ఈ ఉద్యమం వెనుక అన్షుల్ గుప్తా ( Anshul Gupta ) అనే వ్యక్తి ఉన్నాడు. అన్షుల్ తల్లి దీపా గుప్తా ఆరొందల మంది మహిళలతో ‘కాంతా ఎంబ్రాయిడరీ’ని ప్రారంభించింది. అన్షుల్, ఆయన సోదరి తన్వి.. ఇద్దరూ కాంతా ఎంబ్రాయిడరీని మరింత విభిన్నంగా తీర్చిదిద్దాలని భావించారు. తమ యూనిట్స్‌లో గారా, పెటిట్ పాయింట్ డిజైన్లనూ ప్రారంభించారు. బాల్య వివాహ బాధితులు, గృహహింస పీడితులకు ప్రస్తుతి డిజైన్స్ భరోసా కల్పిస్తున్నది. పన్లో పనిగా కనుమరుగవుతున్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ శైలికి జీవం పోస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
Kattula lakshmi | అప్పుడు తుపాకి పట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథలకు అమ్మ అయింది
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..