పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ సమయంలో కడుపు ఉబ్బరం సమస్య చాలా సాధారణం. కొంతమందికి బహిష్టు సమయంలో ఈ సమస్య ఉంటే.. కొందరికి పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈ సమస్య మొదలవుతుంది. రుతుక్రమం సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్లనే పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు సెలవిస్తున్నారు.
పీరియడ్స్ ప్రారంభానికి ముందు శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల పరిమాణం మారుతుంది. పీరియడ్స్ రావడానికి వారం ముందు ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఇది గర్భాశయం లైనింగ్‌ను విస్తరించడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. ఈ మార్పులతో ప్రేగుల పని మందగిస్తుంది. దీని కారణంగా నీరు, ఉప్పు ఇక్కడ పేరుకుపోవడం మొదలవుతుంది. అలాగే, ప్రేగుల్లో సంకోచం కూడా ఉబ్బరానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు.
నిమ్మరసం: పీరియడ్స్ సమయంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల అపానవాయువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కడుపు ఉబ్బరం సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగాలి.
కొబ్బరి నీరు: కొబ్బరి నీరు గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది. అదేవిధంగా చాలా విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.
అజ్వైన్ వాటర్: ఒక గ్లాసులో ఒక టీస్పూన్ ఓమ (వాము), చిటికెడు ఇంగువ, ఉప్పు కలిపిన నీటిని మరిగించి ఫిల్టర్ చేసి తాగుతూ ఉండాలి.
జీలకర్ర-నల్ల ఉప్పు: నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలోవెరా జ్యూస్: ఈ జ్యూస్ కడుపులో ఉండే బ్యాక్టీరియాను వదిలించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రసాన్ని రోజుకు 2, 3 సార్లు త్రాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
వ్యాయామం: ఋతుస్రావం సమయంలో వ్యాయామం చేయడం కష్టం. అయితే, తేలికపాటి వ్యాయామాలు లేదా యోగా ఎంచుకోవాలి. నడక వల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.
ఈ పానీయాలను నివారించండి: టీ, కాఫీ, సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం మానుకోవాలి. ఈ డ్రింక్స్ తీసుకుంటే కడుపులో అపానవాయువును సృష్టించి ఇబ్బంది పెడుతుంది.