Menopause | మెనోపాజ్ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి?
Menopause | మహిళల శరీరాలు ఎన్నో మార్పులకు గురవుతాయి. అందులో ఒకటే మెనోపాజ్. రుతుక్రమం ఆగిపోయే దశ ఇది. ఒకప్పుడు యాభై ఏండ్లకు కానీ వచ్చేది కాదు. మారుతున్న జీవనశైలి కారణంగా నలభైలలోనే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే, చాలామందికి మెనోపాజ్ ఇబ్బందుల పట్ల అవగాహన ఉండటం లేదు.
♦ మెనోపాజ్ తర్వాత ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం తప్పనిసరి. పోషకాహారం తీసుకోవాలి. తేడావస్తే, గుండెపోటు వచ్చే ఆస్కారం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
♦ మెనోపాజ్ దశలో పొత్తికడుపు ముందుకొస్తుంది. బరువు పెరగడం కూడా ప్రారంభం అవుతుంది. దీన్ని మొదట్లోనే నియంత్రించాలి.
♦ హార్మోన్ల అసమతుల్యత వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. అయితే ఇది ఒక్కో మహిళలో ఒక్కోలా ఉంటుంది.
♦ కాలం, వాతావరణంతో సంబంధం లేకుండా చర్మం పొడిబారుతుంది. తలపై మాడు కూడా పొడిబారిపోయి దురదకు దారితీస్తుంది. కాబట్టి, నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వాడాలి.
♦ ముఖ్యంగా ఈ దశలో ఎముకలు బలహీనపడతాయి. క్యాల్షియంతో కూడిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
♦ నిద్రలేమి కూడా ఎక్కువే. హార్మోన్ల అసమతుల్యత ఇందుకు ఓ కారణం.
Read More :
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?”
“ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే మహిళల కోసమే ఈ సర్వీసులు.. మీరు లుక్కేయండి”
అవకాశం వస్తే ఆర్టీసీ డ్రైవర్ కొలువు చేస్తానంటున్న కరీంనగర్ ఆడబిడ్డ.. ఎందుకంటే”
రుతుక్రమం చీకటి గదిలో దాచిపెట్టే విషయం కాదు.. ఆడపిల్లలకు భరోసా ఇస్తున్న స్కూల్ టీచర్”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

