ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే మహిళల కోసమే ఈ సర్వీసులు.. మీరు లుక్కేయండి
Tour | కరోనా ఫస్ట్ వేవ్.. అసలు ఉంటామో లేదో అనే భయం. సెకండ్ వేవ్.. ఉంటాం కానీ, బయటికి వెళ్లొద్దనే భద్రత. థర్డ్ వేవ్.. బయట తిరిగినా మాస్క్ పెట్టుకుంటే చాలనే భరోసా. ఇకనుంచి బేఫికర్. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. అందులోనూ మహిళల కోసమే ప్రత్యేక టూరిజం ప్యాకేజీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొన్ని వెబ్సైట్ల వివరాలు..
ది వాండర్ గర్ల్స్
మహిళల కోసమే ప్రత్యేకంగా పర్యటనలు, కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఇది. భారతదేశాన్ని చుట్టేయాలనుకునే వారికి టూర్ ప్యాకేజీ, ట్రిప్ ప్లానింగ్ సేవలు అందిస్తున్నది. మహిళా పర్యాటకులలో చాలామంది సోలో ట్రిప్‌ను ఇష్టపడతారు. కొంతమంది మాత్రం అపరిచితులతో ప్రయాణాన్ని కోరుకుంటారు. ఎవరికి ఎలా కావాలంటే అలా ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేస్తుందీ సంస్థ. పనిలోపనిగా షాపింగ్ ఏర్పాట్లూ చేస్తారు. మరింత సమాచారం కోసం thewandergirls.comను క్లిక్ చేయవచ్చు.
వాండరింగ్ జానే
సెలవురోజుల్లో ఏదో ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్లాలనుకునే మహిళలకు ఇదొక మంచి వేదిక. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ లొకేషన్‌ను ఎంచుకున్నా మధురమైన పర్యాటక
అనుభూతులను అందిస్తామని మాటిస్తున్నది ఈ సంస్థ. ఆసక్తి ఉన్నవారు wanderingjane.comను క్లిక్ చేస్తే చాలు.
ది వావ్ (ఉమెన్ ఆన్ వాండర్ లస్ట్) క్లబ్
ఈ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రయాణికులను 50కి పైగా గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది. నాణ్యమైన సౌకర్యాలు, నిపుణులైన గైడ్స్ తమ ప్రత్యేకత అని చెబుతున్నది. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. దేశీయంగా సిక్కిం, కశ్మీర్, తమిళనాడు మొదలైన రాష్ర్టాల పర్యాటక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. వివరాలకు: www.wowclub.com చూడవచ్చు.
బియాండ్ ట్రావెల్
ఈ సంస్థ 50 దేశాలలో పర్యాటక సేవలు అందిస్తున్నది. ప్రపంచాన్ని అన్వేషించాలి, కొత్త గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఇది చక్కని వేదిక. స్థానిక కళలు, సంస్కృతి, సంగీతం, ఆహారం మొదలైన వాటి గురించి అధ్యయనం చేసే అవకాశమూ ఇస్తుంది. సమగ్ర వివరాలకు www.byondtravelను సందర్శించవచ్చు.
ది ఫ్లాపర్ లైఫ్
ఒంటరిగా పర్యటనలకు వెళ్లే మహిళలు లేదా స్నేహితురాళ్లతో కలిసి బయల్దేరే వారి కోసం పనిచేస్తున్నదీ సంస్థ. బొటిక్ ప్రాపర్టీస్, ఎకో స్టే, త్రీస్టార్, ఫోర్స్టార్ హోటల్స్‌లో బస సౌకర్యాలు అందిస్తుంది. మరింత సమాచారం కోసం www.theflapperlife.comను క్లిక్ చేయవచ్చు.
F5 ఎస్కేప్స్
పూర్తిగా మహిళల నేతృత్వంలో నడిచే సంస్థ ఇది. బోర్డులో కూడా అనుభవజ్ఞులైన మహిళా గైడ్లే ఉంటారు. మోటర్ బైక్ పర్యటనలకూ అవకాశం ఇస్తున్నది. ఆన్లైన్లో www.f5escapes.comను సంప్రదించవచ్చు.
Read More :
అర్ధరాత్రైనా ఇక్కడ పగల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్తమించని ప్రాంతాలివే..”
“వేసవిలో ప్రయాణమా..ఈ చిట్కాలు పాటించండి”
“Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి”
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది”
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటి తెలుసా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

