Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి
Khajuraho Dance Festival | ప్రేమికుల అపర బృందావని.. కొత్త దంపతుల బిడియాలకు గడియ తీసే శృంగార నగరి.. వయసుడిగిన వారిలోనూ కొత్త ఆశలు రేకెత్తించే ‘కళా’ మండపం.. ఖజురహో! అన్ని శాస్త్రాలకు కాన్వాస్గా నిలిచే భారతీయ ఆలయాల్లో ఖజురహోది ప్రత్యేక స్థానం. కోవెలల కుడ్యాలపై నిలిచిన ఇసుకరాతి శిల్పాలు.. మనసులో కోర్కెల సునామీని సృష్టిస్తాయి. కళాహృదయులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ జరిగే ‘ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్’కు దేశదేశాల నుంచి అతిథులు విచ్చేస్తారు.
శతాబ్దాల చరిత్ర ఖజురహో సొంతం. క్రీస్తుశకం 10-11 శతాబ్దాల కాలంలో చందేల రాజులు ఖజురహో రాజధానిగా మధ్య భారతాన్ని పాలించారు. వారి హయాంలోనే ఆ నగరి కళలకు కాణాచిగా రూపుదిద్దుకుంది. అడుగడుగున వెలిసిన ఆలయాలు, వాటిపై అణువణువూ నిలిచిన కళారూపాలు.. ఖజురహోకు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తరగని ఖ్యాతిని కట్టబెట్టాయి. దేవుళ్ల మూర్తులు, సంప్రదాయాలు తెలియజేసే శిల్పాలు ఒకవైపు, కామశాస్త్ర భంగిమలను కళ్లముందు ఉంచే కళా రూపాలు మరోవైపు ఖజురహో పర్యాటకుల కండ్లకు విరామం లేకుండా చేస్తాయి.
రాళ్లలో జవరాళ్లు
ఖజురహోలో మతంగేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైనదిగా చెబుతారు. దీనికి సమీపంలోనే ఉంటుంది లక్ష్మణ మందిరం. ఆలయ గోపురం, స్తంభాలపై వందలాది శిల్పాలు దర్శనమిస్తాయి. విష్ణుమూర్తి ఆలయంలో రాళ్ల నుంచి పుట్టుకొచ్చిన జవరాళ్లు.. ‘కండ్లముందుకు వచ్చి నాట్యం చేస్తున్నారా!’ అన్న అనుభూతిని కలిగిస్తాయి. మరో మంటపంలో కొలువుదీరిన భారీ వరాహ మూర్తిపై చెక్కిన చక్కని శిల్పాలు ఆనాటి శిల్పకారుల వైచిత్రికి నిదర్శనంగా కనిపిస్తాయి. చిత్రగుప్త, జగదంబ, విశ్వనాథ, సూర్య మందిరాలు సైతం యాత్రికులకు కళల విందును వడ్డిస్తాయి. ఖజురహోను అలనాటి ప్రేమ విశ్వ విద్యాలయంగా భావించేవారూ ఉన్నారు.

ఘనంగా నృత్యోత్సవం
కాలాలకు అతీతంగా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. వెడ్డింగ్ డెస్టినేషన్గానూ పేరొందింది. ఖజురహో అందాలను చూస్తూ, మైమరచిపోవడానికి ప్రేమికులు వరుస కడుతుంటారు. కొత్త దంపతులు హనీమూన్ కోసమూ ఈ శిల్పనగరికి వస్తారు. మూడు రోజులు ఉండి.. మూడు రాత్రులు ముచ్చటగా వలపు పాఠాలు నేర్చుకుంటారు. ఈ పర్యాటక యాత్రాస్థలిలో ఏటా ఫిబ్రవరిలో డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. కరోనా కారణంగా రెండేండ్లుగా నిరాడంబరంగా జరిగిన ఈ ఉత్సవాన్ని ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ప్రఖ్యాతిగాంచిన కళాకారులూ పాల్గొంటారు. తమ నాట్య విన్యాసాలతో అందర్నీ అబ్బురపరుస్తారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, కథాకళి వంటి శాస్త్రీయ నృత్యరీతులన్నీ ప్రదర్శిస్తారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు నృత్యోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ (వివరాలకు 98660 69000) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తిరుగు ప్రయాణంలో చారిత్రక నగరం ఓర్ఛానూ చూడొచ్చు. ఖజు రహో మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచదు.
అజ్ఞాతంలో..
పదహారో శతాబ్దం తర్వాత.. ఖజురహో అజ్ఞాతవాసం మొదలైంది. ఆ నిర్మాణం చుట్టూ రకరకాల అపోహలు ప్రాణంపోసుకున్నాయి. అటువైపు తొంగి చూసే సాహసం ఎవరూ చేయలేక పోయారు. మళ్లీ పద్దెనిమిదో శతాబ్దంలో జె.బి. ఫ్రాంక్లిన్ అనే బ్రిటిష్ మిలిటరీ సర్వేయర్ ఆనిర్మాణాన్ని గుర్తించాడు. మరో రెండు దశాబ్దాల తర్వాత టి.ఎస్.బర్ట్ అనే బ్రిటిష్ ఆర్మీ కెప్టెన్ చొరవతో ఖజురహో శిల్ప ప్రపంచం గురించి ప్రపంచానికంతా తెలిసిపోయింది.
Read More :
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?”
“Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే”
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..”
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!”
“పెండ్లయి మూడేండ్లు అవుతుంది.. మా ఆయన స్పర్శలో ఒక్కసారి కూడా ఆనందం కలగలేదు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

