పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెబుతారు. వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది. పుట్టింటికి వెళ్లినా, మరెవరైనా బంధువుల ఇంటికి వెళ్లినా తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయరాదనేది ప్రయాణ నవమి నియమం.
ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి తొమ్మిదో రోజు తిరిగి ఇంటికి రాకూడదని ప్రవేశ నవమి హెచ్చరిస్తుంది. అలాగే నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతుంది. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు. ఆడపడుచును పార్వతీదేవిగానూ, లక్ష్మీదేవిగానూ భావించడం మన సంప్రదాయం. నవమి తిథి అధిష్ఠాన దేవత దుర్గాదేవి. శక్తికి ప్రతిరూపమైన ఆడపడచును అత్తవారింటికి ఆడపిల్లను పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి పుట్టినింటికీ, మెట్టినింటికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ప్రయాణ నవమిగా చెప్పుకొనే తొమ్మిదో రోజు ఆడకూతురును అత్తగారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ప్రయాణం మంచిదికాదనే విశ్వాసం ఏర్పడింది.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Read More :
ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- Doubts
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

