పీరియడ్స్‌లో సమస్యలా? ఈ యోగాసనాలు వేస్తే మంచిదట!!
Periods | ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా మహిళల్లో నెలసరి సమస్యలు అధికం అవుతున్నాయి. రుతుక్రమం సరిగ్గా రాకపోవడం, నొప్పి, అధిక రక్తస్రావం, చికాకు.. నిత్యం వేధిస్తుంటాయి. దీనికి యోగా చక్కని పరిష్కారమని అంటారు నిపుణులు.
భుజంగాసనం
బోర్లా పడుకుని తలను వెనక్కి వంచుతూ వేసే ఈ ఆసనం ఎంతో సులభం. క్రమం తప్పకుండా ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. పొట్టలోపలి భాగాలకు చక్కని వ్యాయామం అవుతుంది. అండాశయం పనితీరు మెరుగుపడి సంతాన సాఫల్యతకు తోడ్పడుతుంది.
బద్ధకోణాసనం
సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్టుగా రెండు అరికాళ్లను వేగంగా ఆడించాల్సి ఉంటుందీ ఆసనంలో. దీనివల్ల కటి ప్రాంతంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. తద్వారా కాళ్లు, నడుము, పొట్టభాగాలకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా గంటల కొద్దీ కూర్చోవడం వల్ల కటి ప్రాంతంలో ఏర్పడే అసౌకర్యాన్ని కూడా ఈ ఆసనం బాగా తగ్గిస్తుంది.
సేతుబంధాసనం
కాళ్లూ మెడ భాగాన్ని నేల మీద ఉంచి, నడుము భాగాన్ని మాత్రం గాల్లోకి ఎత్తి ఉంచుతూ వేసే ఈ యోగాసనం థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. మెనోపాజ్ సమయంలో కలిగే ఇబ్బందులనూ అరికడుతుంది. గర్భాశయం, అండాశయంలాంటి భాగాలను ఉత్తేజపరుస్తుంది.
పద్మాసనం
రెండు కాళ్లనూ ఒక దగ్గరికి తీసుకువచ్చి ఒకకాలు మీద మరోకాలుని మడుస్తూ వేసే పద్మాసనం అందరికీ సుపరిచితమే. ఈ ఆసనం హార్మోన్ల అసమతుల్యాన్ని అరికట్టి గర్భధారణ అవ
కాశాల్ని మెరుగుపరుస్తుంది. నెలసరి సమయంలో పద్మాసనంలో కాసేపు కూర్చోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణను అదుపులో ఉంచి మెదడుకూ హాయినిస్తుంది.
Read More :
Menopause | మెనోపాజ్ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి?”
పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం.. నివారణ ఇలా..!”
“Rtu Vidya | పీరియడ్స్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు.. అన్నింటికీ సమాధానమే ఈ బుక్”
viparita karani aasan | నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే గర్బిణులు ఈ ఆసనం వేయడం బెటర్”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

