Young Scientist Gitanjali Rao | ఆమె వయసు పదిహేను. ఒకప్పుడు ప్రపంచాన్ని, మొన్నటి వరకు కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన ‘జికా’ వైరస్ అంతుచూడటమే తన లక్ష్యమని ప్రకటించింది. ఆ వైపుగా ప్రయోగాలూ ప్రారంభించింది. ‘తలలు పండిన శాస్త్రవేత్తల వల్లే కావడం లేదు. ఈ పసిపిల్ల ఏం చేస్తుంది?’ అనుకుంటున్నారేమో. గీతాంజలి రావు నేపథ్యం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
ఇటీవల కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో ‘జికా’ వైరస్ విజృంభించింది. వందల కేసులు నమోదు అయ్యాయి. ఇదో రాకాసి వ్యాధి. గర్భిణులకు సోకితే పుట్టబోయే పిల్లల్లో వైకల్యం ఏర్పడవచ్చు. భవిష్యత్ తరాలకు జికా సోకకుండా తన వంతు ప్రయోగాలు ప్రారంభించింది భారత సంతతికి చెందిన పదిహేనేండ్ల గీతాంజలి రావు. తనిప్పుడు పదో తరగతి. అయితేనేం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇస్తున్నది. ప్రఖ్యాత పరిశోధన కేంద్రాలలో ప్రయోగాలు చేస్తున్నది. వైరస్ జన్యువులను గుర్తించి, మరొకరికి సోకకుండా ‘జీన్ ఎడిటింగ్’ చేయడం సాధ్యమేనని గీతాంజలి అభిప్రాయం. తనకు ఆవిష్కరణలు కొత్తేంకాదు. మూడో తరగతి నుంచే ఎన్నో విజయాలను అందుకున్నది.
Young Scientist Gitanjali Rao
ప్రతి విమానంలో ఓ బ్లాక్ బాక్స్ ఉంటుంది. కానీ, ప్రమాద సమయంలో అది ఎక్కడో పడిపోతుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా దొరకదు. దీంతో ప్రమాద కారణాలు తెలుసుకోలేం. సాంకేతిక తప్పిదాలను సరిచేసుకోలేం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్లాక్ బాక్స్ జాడ కనిపెట్టేందుకు ఓ పరికరాన్ని రూపొందించింది గీతాంజలి. అది చూసి ముచ్చటపడే ‘టైమ్’ పత్రిక.. ఎంతో మంది యువ పరిశోధకులు, కౌమార శాస్త్రవేత్తలను వెనక్కినెట్టి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించింది. కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కూడా తనదైన కృషి చేస్తున్నది గీత. సైబర్ వేధింపులు, డ్రగ్స్ వాడకం లాంటి సామాజిక సమస్యలను నిరోధించడానికి ‘కైండ్లీ’ అనే కృత్రిమ మేధ యాప్‌ను రూపొందించింది. ఆ పరిశోధనలకు ఫిదా అయిన హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ గీతాంజలిని వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసింది. ‘ప్రపంచం సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సమస్యలకు సైన్స్‌లోనే సమాధానం ఉంది. అందుకే, మరింతమంది శాస్త్రవేత్తలు తయారు కావాలి. ప్రపంచాన్ని రక్షించుకోవాలి’ అని పిలుపునిస్తున్నది గీతాంజలి.
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
ఒకసారి మోడలింగ్ చేస్తే.. ఇంకోసారి పొలం పనులు చేస్తది.. ఎందుకలా..”
Kriti Trust | నలుగురి కోసం ఆ ఇద్దరు.. లక్షల జీతాలు వదిలి మరి..”
ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”