బొంబాయి రవ్వ: ఒక కప్పు, పాలు: ఒకటిన్నర కప్పు, పెరుగు: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, నూనె: అరకప్పు, బేకింగ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, టూటీఫ్రూటీ: పావుకప్పు.
ముందుగా రవ్వను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో చక్కెర, పెరుగు వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత ఒక కప్పు పాలు, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రవ్వ పొడి వేసి బాగా కలిపి.. పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మిగతా పాలు, టూటీఫ్రూటీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలో వేసుకుని కుక్కర్ లేదా ఒవెన్లో నలభై నిమిషాలపాటు ఉడికించుకుంటే వేడివేడి రవ్వ కేక్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bread cake recipe | బ్రెడ్ కేక్ తయారీ విధానం
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం
నోరూరించే హలీమ్ లడ్డూలు.. కావాల్సినప్పుడు వేడి చేసుకుని లాగించేయడమే!!
millet upma recipe | జొన్న ఉప్మా తయారీ విధానం