కావలసిన పదార్థాలు
బిస్కెట్లు: ఇరవై, పాలు: ఒక కప్పు, చక్కెర: అరకప్పు, నూనె: అరకప్పు, బేకింగ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, టూటీఫ్రూటీ: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా బిస్కెట్లను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఓరియో బిస్కెట్స్ తీసుకుంటే మాత్రం మధ్యలోని క్రీమ్ తీసేయాలి. ఒక గిన్నెలో బిస్కెట్ పొడి, పాలు, చక్కెర, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, టూటీఫ్రూటీ వేసి బాగా కలపాలి. కేక్ మౌల్డ్కు నూనె రాసి, బిస్కెట్ మిశ్రమం వేసి, పైనుంచి టూటీఫ్రూటీ చల్లుకోవాలి. విజిల్, వాచర్ లేకుండా కుక్కర్లో ఐదు నిమిషాలు వేడిచేసి.. కేక్మౌల్డ్ పెట్టి నలభై నిమిషాలు ఉడికించుకుంటే నోరూరించే బిస్కెట్ కేక్ సిద్ధం.