జొన్న ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, ఎండు మిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, క్యారెట్ ముక్కలు: ఒక టేబుల్ స్పూన్, పచ్చి బఠాణీలు: రెండు టీస్పూన్లు, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, కొత్తిమీర: కొద్దిగా, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
స్టవ్ మీద రవ్వ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తురుము, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీ జోడించి మరో రెండు నిమిషాలు వేయించి.. రెండున్నర కప్పుల నీళ్లుపోసి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా తగినంత ఉప్పువేసి, వేయించి పెట్టిన రవ్వ వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సన్నటి మంటపై దగ్గరపడేంతవరకు ఉడికించి, చివరగా కొత్తిమీర తురుము చల్లుకుంటే జొన్న ఉప్మా సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వెరైటీ టేస్ట్ కావాలా? మూంగ్దాల్ చిల్లాఇలా ట్రై చేయండి.
sajjala payasam recipe | సజ్జల పాయసం తయారీ విధానం
Avocado Pasta Recipe l అవకాడో పాస్తా తయారీ విధానం
ragi puttu recipe | రాగిపుట్టు ఇలా తయారు చేసుకోండి
broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
recipe of chicken pancake | రుచికరమైన చికెన్ పాన్కేక్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి
broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
chicken paratha recipe | చికెన్ పరాఠా రెసిపీ