ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
Tomato prices | బిర్యానీ, కుర్మా, మసాలా, గ్రేవీ, కూర, చారు.. ఏ వంటకైనా టమాట ఉండాల్సిందే. ఫ్రిజ్‌లో ఓ కిలో అయినా లేకపోతే, ఏదో వెలితి! అంతగా మన ఆహారంలో భాగమైపోయింది. ఇప్పుడేమో, దీని ధర సెంచరీకి చేరువలో ఉంది. ఇలాంటి సమయాల్లో ప్రత్యామ్నాయం వెతుక్కోవడమే ఉత్తమం.

కూర చిక్కదనం కోసం టమాట బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయల్ని దోరగా వేయించి, మెత్తగా రుబ్బుకుని వాడుకుంటే సరిపోతుంది.
టమాటకు తిరుగులేని ప్రత్యామ్నాయం చింతపండు. కూర ఉడికేటప్పుడు కాస్త చింతపండు
గుజ్జు వేస్తే చాలు. కమ్మని రుచినిస్తుంది. టమాటతో పనే ఉండదు.
ఉసిరి, మామిడి తురుమును కూడా టమాట స్థానంలో వాడుకోవచ్చు. పప్పు, చారు, రసం వంటి వాటిలో సీజన్‌ను బట్టి ఉసిరి, మామిడి ముక్కలను వేసుకోవచ్చు.
టమాట ధర తక్కువగా ఉన్నప్పుడే టోకుగా కొని.. ముక్కలుగా కోసి, ఎండబెట్టి, తడి తగలకుండా భద్రపరచుకుంటే కావాల్సినప్పుడల్లా వేడి నీళ్లలో వేసి వాడుకోవచ్చు. పొడి రూపంలోనూ నిల్వ చేసుకోవచ్చు.
టమాట ఉడకబెట్టిన గుజ్జులో తగినంత ఉప్పువేసి, ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే రెండుమూడు నెలలపాటు కూరల్లో వాడుకోవచ్చు.
ఆరునూరైనా, కిలో వందైనా.. మాకు టమాట ఉండాల్సిందే అంటారా? అయితే, ఓ పావుకిలో తెచ్చుకుని మితంగా తినండి. టమాట చట్నీ లాంటి వంటకాల జోలికి వెళ్లకుండా.. కూరలో, పప్పులో ఒకటో రెండో వాడుకుంటే సరిపోతుంది!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Health tips : ఈ కూరగాయతో వ్యాధులు దరిచేరవు!
Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ ఫుడ్ మీకోసమే !!
Prawn Biryani | హైదరాబాదీ బిర్యానీల్లో నయా ట్రెండ్ రొయ్యల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

