Prawn Biryani | హైదరాబాదీ బిర్యానీల్లో నయా ట్రెండ్ రొయ్యల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
Prawn Biryani |చికెన్, మటన్, ఎగ్, మష్రూమ్..ఏ బిర్యానీకైనా హైదరాబాదే రాజధాని. ఫోర్బ్స్ రుచుల ర్యాంకింగ్‌లోనూ మనమే కింగ్! సీ ఫుడ్ లవర్స్ కోసం చేపలు, పీతలు, రొయ్యలతోనూ బ్రహ్మాండమైన బిర్యానీలు వండుతున్నారు బావర్చీలు. చికెన్, మటన్లకు తీసిపోకుండా నాన్‌వెజ్ ప్రియులు ఇష్టపడే రొయ్యల బిర్యానీ విశేషాలు..

బిర్యానీకి మసాలా ఆత్మ లాంటిది. రొయ్యల బిర్యానీలో వాడే మసాలా చాలా ప్రత్యేకం. సముద్ర జీవుల్లోంచి వచ్చే నీచు వాసనంతా పోయేలా ప్రత్యేకమైన దినుసులతో తయారు చేస్తారు.ఇది రొయ్యలతో పాటు అన్నానికీ కొత్త రుచినిస్తుంది.

సీ ఫుడ్ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోళ్లు సముద్రంలా ఊరిపోతాయి. ఆ జిహ్వ చాపల్యానికి ఆనకట్టలు వేయడానికి, జలాశయాల్లో దొరికే రకరకాల జీవులతో సరికొత్త వంటకాలు వండి వడ్డించాల్సిందే.రొయ్యలతోనూ కూర, పులుసు, వేపుడు, ఇగురు.. వంటివన్నీ వండుతారు పాకశాస్త్ర నిపుణులు. అయినా, తనివితీరకపోతే రొయ్యల బిర్యానీ ఉండనే ఉంది.

తెలంగాణలో మంచినీటి రొయ్యలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి పరిమాణంలో చిన్న అయినా, రుచిలో మాత్రం మిన్న. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న టైగర్ రొయ్యలూ మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ తెలంగాణ చెరువుల్లో విరివిగా పెరిగే చిట్టి రొయ్యలకే గిరాకీ ఎక్కువ.

రొయ్యలు బలవర్ధకమైనవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు పొందవచ్చు. రొయ్యల్లో క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2 ఉంటాయి. వీటిలోని ప్రత్యేక పోషకాలు, నిత్యం కంప్యూటర్లు ఉపయోగించే వారికి.. కంటి అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఏ బిర్యానీ అయినా,వండే పద్ధతిలో పెద్దగా తేడా ఉండదు. అయితే రొయ్యల రుచి, వాసన వల్ల వంట మరింత ఘుమఘుమలాడుతుంది. అందుకే,ఏ రెస్టరెంట్‌కు వెళ్లినా ‘బాప్ ఆఫ్ బిర్యానీస్’ హోదా రొయ్యల పులావ్కే దక్కుతుంది.
ఈ ఆదివారం… రొయ్యల బిర్యానీ ప్రాప్తిరస్తుః
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా
వెరైటీ ఫుడ్ : పూరీల్లోకి బిర్యానీ .. ఎక్కడ దొరుకుతుందంటే..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

