Nalli Biryani : మూలుగ బొక్కల బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ బిర్యానీయే ఫేమస్
మూలుగ బొక్కల బిర్యానీ | హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ దొరకదు. అందుకే.. హైదరాబాద్ బిర్యానీ అంత ఫేమస్ అయింది. హైదరాబాదీ బిర్యానీలోనూ పలు వెరైటీలు ఉంటాయి
బిర్యానీ గురించి మాట్లాడితే చాలు.. మనకు టక్కున గుర్తొచ్చే నగరం హైదరాబాద్. సప్త సముద్రాలు దాటినా.. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ దొరకదు. అందుకే.. హైదరాబాద్ బిర్యానీ అంత ఫేమస్ అయింది. హైదరాబాదీ బిర్యానీలోనూ పలు వెరైటీలు ఉంటాయి. దమ్ బిర్యానీ, టిక్కా బిర్యానీ, స్పెషల్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, మండి.. ఇలా పలు పేర్లతో బిర్యానీ ఫేమస్ అయింది.

రీసెంట్గా జఫ్రానీ బిర్యానీ ఫేమస్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్న బిర్యానీ.. నల్లి బిర్యానీ. అవును.. పేరేంటి కొత్తగా ఉంది అంటారా? పదండి.. నల్లి బిర్యానీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
నిజానికి.. నల్లి బిర్యానీ అనేది నార్త్ ఇండియాలో ఎప్పటినుంచో ఉంది. కానీ.. సౌత్ వాళ్లకు అంతగా పరిచయం లేని బిర్యానీ ఇది. ఢిల్లీ, జమ్ముకశ్మీర్ తో పాటు.. ముంబైలో కూడా నల్లి బిర్యానీ ఫేమస్. కానీ.. ప్రస్తుతం మన హైదరాబాద్‌లో నల్లి బిర్యానీ ట్రెండ్ నడుస్తోంది. ఏ హోటల్లో చూసినా.. స్పెషల్ నల్లి బిర్యానీ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

హైదరాబాదీలు బిర్యానీలలో కొత్త టేస్టులను వెతుకుతుంటారు. అందుకే.. నగరంలోని బిర్యానీ హోటళ్లు.. ఇలా అప్పుడప్పుడు సరికొత్త బిర్యానీలను తయారు చేస్తుంటాయి. అందులో కొన్ని సూపర్ సక్సెస్ అవుతాయి. అంటే.. అవి జనాలకు నచ్చుతాయన్నమాట. తాజాగా నల్లి బిర్యానీ కూడా హైదరాబాదీలకు సూపర్బ్‌గా నచ్చుతుండటంతో.. చెఫ్‌లు ఆ బిర్యానీ చేయడం నేర్చుకొని.. తమ హోటళ్లలో కూడా స్పెషల్‌గా నల్లి బిర్యానీని ఆఫర్ చేస్తున్నారు.
చికెన్ లెగ్‌పీస్ బిర్యానీకి పోటీగా నల్లి బిర్యానీ
చాలామందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమే. అందులో లెగ్ పీస్ బిర్యానీ అంటే పడి చచ్చిపోతారు. బిర్యానీలో రారాజు అంటే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. అయితే.. కొందరికి చికెన్ పడదు. కానీ… బోన్స్ అంటే ఇష్టం ఉండేవాళ్లు ఉంటారు. అటువంటి వాళ్ల కోసం వచ్చిందే ఈ నల్లి బిర్యానీ. చికెన్ బిర్యానీకి అల్టర్నేట్గా వచ్చింది కాబట్టే.. దీనికి హైదరాబాదీలు దాసోహం అంటున్నారు.

నల్లి బిర్యానీని ఎలా తయారు చేస్తారు?
నల్లి బిర్యానీ అంటే ఇంకేదో అనుకునేరు.. మన భాషలో చెప్పాలంటే.. మూలుగ బొక్కల బిర్యానీ. అవును.. చాలామందికి మటన్‌లో మూలుగ బొక్కలే ఇష్టం. మటన్ షాపునకు వెళ్లినప్పుడు మటన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్నా ఒక మూలుగ బొక్క వేయి అన్న అని అడుగుతాం. ఎంత మటన్ తిన్నా.. ఒక్క మూలుగ బొక్కను కొరికితే, దాంట్లోని మూలుగను తింటే వచ్చే మజాయే వేరు. మూలుగను జుర్రుతుంటే.. ఆహా.. ఆ టేస్ట్ గురించి వర్ణించలేం.

సేమ్.. అవే మూలుగ బొక్కలతో ఈ బిర్యానీని చేస్తారు. మటన్ నుంచి మూలుగ బొక్కలను సపరేట్ చేసి.. వాటిని కర్రీగా వండి.. బిర్యానీ రైస్ సపరేట్గా వండి.. రెండూ కలిపి వడ్డిస్తారు. అదే నల్లి బిర్యానీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Idli-Dosa Batter : ఆరో క్లాస్ ఫెయిల్: ఇడ్లీ, దోశ పిండి అమ్ముతూ.. రూ.2000 కోట్ల విలువైన కంపెనీకి సీఈవో అయ్యాడు
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
అసలేంటి.. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టులు.. వీటిని వాతావరణ శాఖ ఎలా జారీ చేస్తుంది?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

