ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష | ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉంటుంది. అదే వాళ్ల మాతృ భాష అవుతుంది. కానీ.. ఒక ఊళ్లో మాత్రం.. రెండు భాషలు మాట్లాడుతారు
ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉంటుంది. అదే వాళ్ల మాతృ భాష అవుతుంది. కానీ.. ఒక ఊళ్లో మాత్రం.. రెండు భాషలు మాట్లాడుతారు. అది కూడా మహిళలు ఒక భాష.. పురుషులు ఇంకో భాష.. భలే విచిత్రంగా ఉంది కదా. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది అంటారా? మన దగ్గర కాదు లేండి. నైజీరియాలో ఉంది. సౌత్ నైజీరియాలోని ఓ గ్రామంలో రెండు భాషలు మాట్లాడుతారు.

ఆ ఊళ్లో ఎక్కువ శాతం మంది ప్రజలు.. వ్యవసాయం మీదే ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తుంటారు. కానీ.. అక్కడి మగవాళ్లు ఒక భాష.. ఆడవాళ్లు ఇంకో భాషను మాట్లాడుతారు. అలా వేర్వేరు భాషలు మాట్లాడటం.. దేవుడి ఆశీర్వాదం తీసుకున్నట్టు అని ఆ ఊరి ప్రజలు భావిస్తారట.
అక్కడ వ్యవసాయం చేసుకునే ఉబాంగ్ అనే తెగ వాళ్లు ఎక్కువగా ఉంటారు. అయితే.. వాళ్లు మాట్లాడే రెండు భాషలు మహిళలు, పురుషులకు అర్థం అవుతాయి కానీ.. ఎవరు మాట్లాడే భాష వాళ్లే మాట్లాడుతారు.
వాటినే మహిళ, పురుషుల భాషలుగా విభజించారు. కొన్ని పదాలు మాత్రం కామన్‌గా ఉంటాయట. అంతే.. ఇక.. ఆ రెండు భాషలకు అస్సలు సంబంధం ఉండదట. మహిళల భాష పురుషులకు.. పురుషుల భాష మహిళలకు రావడం వల్ల.. అక్కడ కమ్యూనికేషన్ సమస్య అయితే ఉండదట.
చిన్నపిల్లలు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏ భాష మాట్లాడినా పట్టించుకోరు కానీ.. మగ పిల్లలు మాత్రం 10 ఏళ్లు దాటితే ఖచ్చితంగా పురుషుల భాషనే మాట్లాడాలి. అయితే.. అక్కడ ఎవ్వరూ ఈ భాషే మాట్లాడు.. అంటూ ఒత్తిడి చేయరు కానీ.. మహిళల భాషను పురుషులు మాట్లాడితే వింతగా చూస్తారట. అనుమానంగా చూస్తారట. అందుకే.. అక్కడి నియమాలు తెలిసిన వాళ్లు ఎవ్వరూ తమ భాష కాకుండా వేరే మాట్లాడరు. ఆ రెండు భాషలకు లిపి ఉండదు. మన దగ్గర గోండు భాషలా అన్నమాట. కేవలం మాట్లాడటమే.. దాన్ని రాయడం ఉండదు. అక్కడి స్కూళ్లలో కూడా ఈ భాషలను నేర్పించరు. కాకపోతే.. తమ కమ్యూనిటీ భాషలను భవిష్యత్తు తరాలు కూడా మరిచిపోకూడదనే ఈ ఆచారాన్ని పెట్టినట్టు అక్కడి పెద్దలు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : పళ్లతో రిబ్బన్ కట్ చేసిన మంత్రి.. వీడియో వైరల్
Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

