వెరైటీ ఫుడ్ : పూరీల్లోకి బిర్యానీ .. ఎక్కడ దొరుకుతుందంటే..

పూరీ విత్ బిర్యానీ | ఎంత లావుగా పొంగిన పూరీలైనా ఆత్మారాముడిని సంతృప్తిపరచాలంటే అందులోకి నంజుకునే కూర అదిరిపోవాలి. నిమ్మరసం పిండిన బొంబాయి చట్నీ, ఉడికీ ఉడకని పెసరపప్పు టమాట, అల్లం పచ్చికారం దట్టించి మెత్తగా ఉడికించిన ఆలూ కుర్మా.. ఇలా కాంబినేషన్ బాగుంటేనే పూరీ రుచి బాగుంటుంది. దేశ రాజధాని హస్తినలో మాత్రం కొత్త ట్రెండ్ పురుడుపోసుకుంది.
స్ట్రీట్‌ఫుడ్ అమ్ముకునే లాల్‌భాయ్ పూరీలోకి వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్‌ను ఆస్వాదించడానికి ఫుడ్ లవర్స్ వరుసలు కడుతున్నారు. ‘మొదట నేను పూరీతో ఆలుగడ్డ కూర ఇచ్చేవాడిని. కాకపోతే, ఇప్పుడు చాలాచోట్ల వెజ్ బిర్యానీ ఫుడ్‌కోర్ట్‌లు వెలిశాయి. దీంతో నేనూ వెజ్ బిర్యానీ అమ్మకం మొదలుపెట్టాను. అయితే, కాస్త కొత్తగా ఆలోచించి బిర్యానీలోకి ఆలూకుర్మా తోపాటు పూరీలనూ ఇస్తున్నాను. దీంతో కస్టమర్లు ఆబగా తినేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు వ్యాపారం పెరిగింది. పొగలు కక్కుతున్న బిర్యానీని పూరీతో కలిపి తింటున్న కస్టమర్లను చూస్తుంటే నాకూ తినాలనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు లాల్. రాజధాని వీధిలో మొదలైన ఈ నయా కాంబినేషన్ మున్ముందు ఎన్ని ఎల్లలు దాటుతుందో చూడాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

