న్యూఢిల్లీ : ఇన్ఫెక్షన్లు, గాయాలతో పాటు పలు కారణాలతో శరీర భాగాల్లో వాపు (ఇన్ఫ్లమేషన్) ఏర్పడుతుంది. ఇన్ఫ్లమేషన్ గురైన శరీర భాగంలో మంట, నొప్పికి ఇది దారితీస్తుంది. క్రానిక్ ఇన్ప్లమేషన్తో అల్జీమర్స్, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంది. రెడ్ మీట్, సోడాలు, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి ఆహార పదార్ధాలు ఇన్ఫ్లేమషన్కు కారణం కాగా మన కిచెన్లో నిత్యం వాడే టమాటాలు దీన్ని నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ గుణాలను కలిగిఉంది.
టమాటాలతో పాటు తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ను నియంత్రించవచ్చు. టమాటాల్లో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్ సీ, ఇతర పోషకాలతో పలు గుండెకు మేలు కలగడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అడ్వాన్సెన్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్లో ప్రచురితమైన ఆక్స్ఫర్డ్ అకడమిక్ అధ్యయనం వెల్లడించింది. ఇక టమాటాలు కంటికి మేలు చేస్తాయని, జీర్ణవ్యవస్ధ సాఫీగా పనిచేసేందుకు ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. చర్మ సంరక్షణకు టమాటాలు కీలకంగా పనిచేస్తాయని వెల్లడైంది.